Health Tips: తలనొప్పి వస్తే వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ఇది ఆ సమస్యకు దారితీయొచ్చు జాగ్రత్త..!
చాలా మంది తలనొప్పి రాగానే వెంటనే మందులు వేసుకుంటారు. కొందరైతే.. నిత్యం మత వెంటే మెడిసిన్స్ ఉంచుకుంటారు. కాస్త నొప్పి రాగానే.. వెంటనే ఆ ట్యాబ్లెట్ తీసి వేసుకుంటారు. కానీ తలనొప్పి సమస్య తరచుగా వచ్చి.. ఔషధం సహాయంతో నియంత్రణ చేసుకుంటే చెడు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిరంతరంగా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ఇది శరీరంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుండి కిడ్నీ వరకు సమస్యలను కలిగిస్తుంది. నిరంతరం మందులు వాడడం వల్ల..
నేటి కాలంలో చాలా మంది ప్రతి సమస్యకు మెడిసిన్స్ వాడుతుంటారు. కొంచె సమస్య వస్తే చాలు వెంటనే మెడిసిన్స్ వేసుకుంటారు. ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. చిన్నపాటి సమస్య వచ్చినా మందులు వాడుతున్నారు. ఇలాంటి వాటిలో తలనొప్పి ఒకటని చెప్పొచ్చు. తలనొప్పి విషయంలో ఈ పరిస్థితి అధికంగా ఉంటుంది. చాలా మంది తలనొప్పి రాగానే వెంటనే మందులు వేసుకుంటారు. కొందరైతే.. నిత్యం మత వెంటే మెడిసిన్స్ ఉంచుకుంటారు. కాస్త నొప్పి రాగానే.. వెంటనే ఆ ట్యాబ్లెట్ తీసి వేసుకుంటారు. కానీ తలనొప్పి సమస్య తరచుగా వచ్చి.. ఔషధం సహాయంతో నియంత్రణ చేసుకుంటే చెడు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిరంతరంగా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ఇది శరీరంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుండి కిడ్నీ వరకు సమస్యలను కలిగిస్తుంది. నిరంతరం మందులు వాడడం వల్ల తలలో ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటే.. కూడా సకాలంలో గుర్తించడం సాధ్యం అవదు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తలనొప్పికి 100 కంటే ఎక్కువ కారణాలు ఉన్నాయని చెబుతారు. మెదడులో అనేక రకాల తీవ్రమైన వ్యాధుల కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. ఎవరికైనా తలనొప్పి ఇలాగే కొనసాగితే.. అది బ్రెయిన్ ట్యూమర్, ఇతర సమస్యల లక్షణం కూడా కావొచ్చు. అలాంటి పరిస్థితిలో ఔషధాలను తీసుకోకుండా ఉండాలి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
అనారోగ్యం తెలియదు..
మెడిసిన్స్ అధికంగా వినియోగించడం వలన తలలో ఏ సమస్య ఉందో తెలియదు. మెదడులో ఏదైనా తీవ్రమైన వ్యాది ఉంటే.. అది చివరి దశకు చేరుకుంటుంది. ఇది వ్యాధి చికిత్సను కూడా కష్టం చేస్తుంది. అలాంటి పరిస్థితిని నివారించడానికి తలనొప్పి సమస్యను తేలికగా తీసుకోకుండా, సొంతంగా మందులు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం.
మెదడు కణితి కూడా కారణం కావచ్చు..
తలనొప్పి సమస్య బ్రెయిన్ ట్యూమర్ లక్షణంగా కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడు కణితిలో, మెదడు చుట్టూ ఉన్న కణాలు అసాధారణ రీతిలో వ్యాప్తి చెందుతాయి. కణితి మెదడు కణజాలం చుట్టూ కూడా సంభవిస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ పెరుగుతూనే ఉంటే, సకాలంలో చికిత్స చేయకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. అలాంటి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయవద్దు. మీకు తలనొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు పరీక్షలు చేసి, అవసరమైన చికిత్స అందిస్తారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..