Health Tips: బ్రౌన్ బ్రెడ్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా? అసలు నిజం ఏమిటో తెలుసుకోండి..

భారత్ మొదలు ప్రపంచ దేశాల ప్రజలు బ్రెడ్‌ను రకరకాలుగా ఉపయోగించి తింటారు. కొందరు టీ తో తింటే.. మరికొందరు టోస్ట్ మాదిరిగా తింటారు. ఇంకొందరు జామ్ అప్లై చేసుకుని తింటారు. శాండ్‌విచ్‌లో, బ్రెడ్‌ పకోడాలు బ్రెడ్ పకోడాలు ఇలా రకరకాలు.. తింటారు. అదే సమయంలో ఈ బ్రెడ్ విషయంలో ఫిట్‌నెస్ గురించి కూడా ఆలోచిస్తారు. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్‌ను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు..

Health Tips: బ్రౌన్ బ్రెడ్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా? అసలు నిజం ఏమిటో తెలుసుకోండి..
Brown Bread
Follow us

|

Updated on: Aug 23, 2023 | 10:52 PM

ప్రపంచ వ్యాప్తంగా బ్రెడ్ అనేది కీలక ఆహారంగా మారింది. ఎందుకంటే.. ఈ బిజీ లైఫ్‌లో నిమిషాల్లోనే అందుబాటులో ఉన్న, మన ఆకలి తీర్చే ఆహారం కాబట్టి. భారత్ మొదలు ప్రపంచ దేశాల ప్రజలు బ్రెడ్‌ను రకరకాలుగా ఉపయోగించి తింటారు. కొందరు టీ తో తింటే.. మరికొందరు టోస్ట్ మాదిరిగా తింటారు. ఇంకొందరు జామ్ అప్లై చేసుకుని తింటారు. శాండ్‌విచ్‌లో, బ్రెడ్‌ పకోడాలు బ్రెడ్ పకోడాలు ఇలా రకరకాలు.. తింటారు. అదే సమయంలో ఈ బ్రెడ్ విషయంలో ఫిట్‌నెస్ గురించి కూడా ఆలోచిస్తారు. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్‌ను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. నిజానికి వైట్ బ్రెడ్‌ను వైట్ ఫ్లోర్‌తో తయారు చేస్తారు. కాబట్టి ఫిట్‌నెస్ ఫ్రీక్స్ బ్రౌన్ బ్రెడ్‌ను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మరి, ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణించబడే బ్రౌన్ బ్రెడ్ నిజంగా ఆరోగ్యానికి మంచిదా? ఇందులో నిజం ఏంటి?

వైట్ బ్రెడ్ శుద్ధి చేసిన మైదాతో తయారు చేస్తారు. బ్రౌన్ బ్రెడ్‌ని గోధుమలు, అనేక ఇతర ధాన్యాలు కలపడం ద్వారా తయారు చేస్తారు. పోషణ గురించి చూసుకుంటే.. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్, చక్కెర, ప్రోటీన్ మొదలైనవి ఉంటాయి.

ఆరోగ్యానికి బ్రౌన్ బ్రెడ్..

బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ, కొన్నిసార్లు ఇందులో పిండి, రంగు, చక్కెర, అనేక ఇతర అంశాలు కూడా ఉంటాయి. అంటే, కేవలం రంగును చూసి బ్రెడ్‌ని కొనుగోలు చేయవద్దు. కానీ పెద్ద, ప్రసిద్ధ బ్రాండ్‌కు చెందిన బ్రౌన్ బ్రెడ్‌ను కొనుగోలు చేసే ముందు.. దాని ప్యాకెట్ వెనుక వ్రాసిన పదార్థాల గురించి చదవాలి. తృణధాన్యంతో తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్‌లో పిండి ఉండదు.

బ్రౌన్ బ్రెడ్ ప్రయోజనాలు..

ఒక అధ్యయనం ప్రకారం, తృణధాన్యాలు తినడం వల్ల శరీరంలో ఫైబర్ లేమిని భర్తీ చేస్తుంది. ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ ఒకటి నుండి రెండు బ్రౌన్ బ్రెడ్‌ను తినొచ్చు. అయితే, బ్రౌన్ బ్రెడ్ నిజంగా సరైనదా కాదా అని గుర్తించాలి.

బ్రౌన్ బ్రెడ్ డైట్‌లో సరైనదేనా?

బ్రౌన్ బ్రెడ్ మార్కెట్ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఫిట్‌నెస్ ఫ్రీక్స్ వైట్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలా సార్లు ప్రజలు అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండటానికి వైట్ బ్రెడ్‌కి బదులుగా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవాలి. అది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గోధమ రంగు ఉన్నవన్నీ బ్రౌన్ బ్రెడ్ కాదు..

నిజానికి, బ్రౌన్ బ్రెడ్ రంగును మరింత మెరిసేలా, బ్రౌన్‌గా మార్చడానికి కృత్రిమ రంగులు కూడా కలుపుతారు. ఇవి పాకం రంగులో ఉంటాయి, వీటిని శీతల పానీయాలలో కూడా ఉపయోగిస్తారు. ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే, వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..