Health Tips: బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా? ఈ ముచ్చట తెలిస్తే షాక్ అవుతారు..!

శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగటం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అనేక వ్యాధులను దూరం అవుతాయి. అయితే, ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని కూడా చాలా మంది ఆరోగ్య నిపుణులు

Health Tips: బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా? ఈ ముచ్చట తెలిస్తే షాక్ అవుతారు..!
పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే రక్త ప్రసరణ మెరుగుపడి చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. ఉదయానే నీరు తాగటం వల్ల మీకు వెంటనే శక్తి లభిస్తుంది. ఎందుకంటే మీ శరీరం ఉదయం డీహైడ్రేట్ అయితే అలసటను కలిగిస్తుంది.
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 23, 2023 | 10:03 PM

శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగటం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అనేక వ్యాధులను దూరం అవుతాయి. అయితే, ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని కూడా చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మరి బ్రష్ చేయకుండా నీళ్ళు తాగడం నిజంగా ఆరోగ్యానికి మంచిదా? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో, బ్రష్ చేయకుండా నీళ్ళు ఎందుకు తాగాలంటే.. రాత్రి 7-8 గంటల వరకు నీరు తాగకుండా ఉంటారు. ఆ కారణంగా ఉదయానే ఖాళీ కడుపుతో, బ్రష్ చేయకుండానే నీరు త్రాగితే కడుపులోని మలినాలన్నీ బయటకు వెళతాయి. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్లే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి..

తెల్లవారుజామున నిద్ర లేవగానే బ్రష్ చేయకుండానే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల పొట్ట క్లీన్ అవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

ఉదయాన్నే పళ్ళు తోముకోకుండా నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక వ్యాధుల నుండి సురక్షితంగా ఉండేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు, సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. అంతేకాదు.. బ్రష్ చేయకుండా నీరు త్రాగడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

హై బీపీ, షుగర్‌ని అదుపులో ఉంచుతుంది..

ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల హై బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి. గోరువెచ్చని నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా ఊబకాయం సమస్య కూడా దూరం అవుతుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఆరోగ్య నిపుణుల సూచనలు, సలహాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..