Viral Video: పాము-ముంగీస మధ్య భీకర పోరు.. చివరికి ఏది గెలిచిందంటే..!

పాము-ముంగీస మధ్య పచ్చ గడ్డి వెయ్యకపోయినా భగ్గుమంటుంది. వీటి మధ్య వైరానికి కారణం ఏంటో గానీ.. అవి ఎదురెదురుపడితే చాలు భీకరంగా పోట్లాడుకుంటాయి.

Viral Video: పాము-ముంగీస మధ్య భీకర పోరు.. చివరికి ఏది గెలిచిందంటే..!
Snake Vs Mongoose
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 15, 2023 | 6:26 PM

పాము-ముంగీస మధ్య పచ్చ గడ్డి వెయ్యకపోయినా భగ్గుమంటుంది. వీటి మధ్య వైరానికి కారణం ఏంటో గానీ.. అవి ఎదురెదురుపడితే చాలు భీకరంగా పోట్లాడుకుంటాయి. అయితే, పామైనా ఉండాలి.. లేదా ముంగీస అయినా ఉండాలి అనేలా కొట్లాడుకుంటాయి. ఫైనల్‌గా ఏదో ఒకటి మిగిలితే గానీ పట్టువీడవు. అంత భయంకరంగా పోట్లాడుకుంటాయి. తాజాగా ఓ ముంగీస, పాము కొట్లాటకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. ఆ రేంజ్‌లో పోట్లాడుకున్నాయి. రక్తాలు కారేలా కరుచుకున్నాయి.

సాధారణంగానే పాము పేరు వింటేనే భయపడుతాయి. ఎందుకంటే.. ఒక్క కాటుతో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే ప్రతి జీవి పాముకు భయపడుతాయి. కానీ, ఒక్క ముంగీస మాత్రం పాముకు ఏమాత్రం భయపడదు. తాజాగా ఓ పాము, ముంగీస కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెండింటి మధ్య జరిగిన భీకర పోరులో చివరకు ముంగీస ప్రాణాలు కోల్పోయింది. ఈ వైరల్ వీడియోను చూసి నెటిజన్లు హడలిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..