Dry Fruits Benefits: పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే ఏమవుతుంది?

రాత్రి పడుకునే ముందు కూడా డ్రై ఫ్రూట్స్ తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తింటే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తగినంత నిద్రపడుతుంది. నిద్రలేమి కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోజులో మనం చేసే ప్రతిపనిలో శరీర అవయవాల్లో కదలికలు ఉంటాయి. ఫలితంగా వాటి సామర్థ్యం, శక్తి తగ్గుతాయి. రాత్రివేళలో వాటికి తగిన విశ్రాంతి ఇస్తేనే.. తిరిగి అవి సజావుగా పనిచేస్తాయి. సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కళ్లు ఎర్రబడటం, ముఖ కవళికలు మారిపోవడం వంటివి జరుగుతాయి. అలాగే మెదడు చురుకుదనం తగ్గుతుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు..

Dry Fruits Benefits: పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Dry Fruits Benefits
Follow us

|

Updated on: Aug 23, 2023 | 6:54 PM

పల్లెటూర్లలో కూడా డ్రై ఫ్రూట్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకూ అందరూ వీటిని వారి డైట్ లో యాడ్ చేసుకుంటున్నారు. డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల తక్షణ శక్తితో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే ఇవి తినడానికి ప్రత్యేకంగా ఒక టైమ్ అంటూ ఉండదు. కొందరు ఉదయం తింటే మరికొందరు సాయంత్రం తింటారు. ఇలా వారికి నచ్చిన సమయాల్లో వాటిని తీసుకుంటూ ఉంటారు. కానీ డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టి తింటేనే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

కానీ రాత్రి పడుకునే ముందు కూడా డ్రై ఫ్రూట్స్ తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తింటే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తగినంత నిద్రపడుతుంది. నిద్రలేమి కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోజులో మనం చేసే ప్రతిపనిలో శరీర అవయవాల్లో కదలికలు ఉంటాయి. ఫలితంగా వాటి సామర్థ్యం, శక్తి తగ్గుతాయి. రాత్రివేళలో వాటికి తగిన విశ్రాంతి ఇస్తేనే.. తిరిగి అవి సజావుగా పనిచేస్తాయి.

సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కళ్లు ఎర్రబడటం, ముఖ కవళికలు మారిపోవడం వంటివి జరుగుతాయి. అలాగే మెదడు చురుకుదనం తగ్గుతుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు పెరుగుతాయి. జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయడం మానేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వస్తాయి. ఇలా నిద్రలేమి మనపై, మన జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు గాఢంగా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్నవెంటనే పడుకుంటే బరువు పెరుగుతాం అని చాలామంది భయం. రాత్రివేళలో అన్నం బదులు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

గాఢంగా నిద్రపోవాలంటే.. రాత్రి 7 గంటలలోగా ఆహారాన్ని తీసుకోవాలి. వీలైనంత వరకూ పండ్లు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తినడం వల్ల పొట్టతేలికగా ఉంటుంది. గ్యాస్ సమస్యలతో ఇబ్బంది ఉండదు. త్వరగా, తేలికగా జీర్ణమవుతాయి. ఉదయాన్నే మలబద్ధకం సమస్యలుండవు. కంటినిండా సుఖనిద్ర కలుగుతుంది. మరుసటిరోజూ యాక్టివ్ గా ఉంటారు. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. రాత్రివేళ తీసుకునే ఆహారంలో బొప్పాయి, జామ, దానిమ్మ, యాపిల్, కివీ వంటి పండ్లు, నానబెట్టిన బాదం, పిస్తా, గుమ్మడి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, సన్ ఫ్లవర్ సీడ్స్, కిస్ మిస్, అక్రూట్స్, అంజీర్ లను తినడం ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి