Deeksha Seth: వేదంలో అల్లు అర్జున్‌ రిచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గుర్తుందా..? ఆమెను ఇప్పుడు చూస్తే మీరు గుర్తు కూడా పట్టలేరు

వరుసగా ఆఫర్స్ అందుకుని.. స్టార్స్ పక్కన నటించిన ఈ బ్యూటీ అనూహ్యంగా వెండితెరకు దూరమైంది. . ఇప్పుడు ఎక్కడుంది..? ఏం చేస్తుంది.. పెళ్లైందా..? ఈ వివరాలు అన్నీ తెలుసుకుందాం పదండి.

Deeksha Seth: వేదంలో అల్లు అర్జున్‌ రిచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గుర్తుందా..? ఆమెను ఇప్పుడు చూస్తే మీరు గుర్తు కూడా పట్టలేరు
Deeksha Seth - Allu Arjun
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 15, 2023 | 12:07 PM

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ లైఫ్ స్పాన్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. వరుసగా నాలుగైదు సినిమాలు పోయాయి అనుకుండి.. వాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే.. హీరోయిన్లుగా చేసినవాళ్లు.. ఒకవేళ అవకాశాలు వచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్టుల చేయలేరు. ట్రీట్మెంట్ సహా పేమేంట్, ఇతర ఫెసిలిటీస్ అన్ని మారిపోతాయి. అందుకే వారు క్యారెక్టర్ రోల్స్ చేయరు. అలా వెండితెరపై మెరిసి.. కనుమరుగు అయిన బ్యూటీల్లో ఒకరు దీక్షాసేథ్‌. అదే అండీ.. వేదం సినిమాలో అల్లు అర్జున్ పెయిర్‌గా చేసింది కదా ఆమే. ఈ సినిమా అనంతరం ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. గోపీచంద్‌‌ సరసన వాంటెడ్‌ మూవీలో, రవితేజతో నిప్పు, మిరపకాయ, ప్రభాస్‌ రెబల్‌ సినిమాల్లో నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఆమె నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ అవ్వనప్పటికీ.. దీక్షా బ్యూటీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. 2012లో వచ్చిన ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా సినిమా అనంతరం ఆమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లి లేకర్‌ హమ్‌ దివానా దిల్‌, ది హౌస్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2, సాత్‌ కడమ్‌ వంటి సినిమాలు చేసింది. అక్కడా బ్రేక్ రాలేదు. కన్నడలో దర్శన్‌ సరసన జగ్గూబాయ్‌ మూవీలో నటించినా.. సుడి తిరగలేదు. దీంతో యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పి.. లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయింది. ఆమె అక్కడ ఐటీ జాబ్ చేస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌ను పలకరిస్తుంది.

దీక్షా రీసెంట్‌గా ఇన్ స్టాలో షేర్‌ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు కంగుతున్నారు. అప్పట్లో బొద్దుగా.. ముద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. దీంతో చాలామంది ఆమె దీక్షాసేథ్‌ అన్నా కూడా గుర్తుపట్టలేకపోతున్నారు.

View this post on Instagram

A post shared by Deeksha Seth (@deeksha721)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.