Jr.NTR: దటీజ్‌ ఎన్టీఆర్.. స్టేజ్ పై తారక్‏ను ఇబ్బంది పెట్టిన అభిమాని.. యంగ్ టైగర్ ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా వచ్చారు తారక్. తమ అభిమాన హీరోను చూడగానే ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటింది. ఆ తర్వాత తారక్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ? ..

Jr.NTR: దటీజ్‌ ఎన్టీఆర్.. స్టేజ్ పై తారక్‏ను ఇబ్బంది పెట్టిన అభిమాని.. యంగ్ టైగర్ ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 18, 2023 | 9:27 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తారక్ అంటే పడిచచ్చే అభిమానులు.. ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. తారక్ కనిపిస్తే చాలు ఎంతో సంబరపడిపోతుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ అభిమానం కాస్త ప్రపంచాన్ని చేరింది. భారతీయులు కాదు.. విదేశీయులు సైతం తారక్ నటనకు.. వ్యక్తిత్వానికి ఫిదా అయ్యారు. ఇటీవల ఆస్కార్ వేడుకలలో పాల్గొన్న తారక్.. హైదరాబాద్ రాగానే ఫ్యాన్స్ చేసిన హడావిడి తెలిసిందే. తాజాగా శుక్రవారం యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా వచ్చారు తారక్. తమ అభిమాన హీరోను చూడగానే ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటింది. ఆ తర్వాత తారక్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ? ..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటేస్ట్ చిత్రం దాస్ కా ధమ్కీ. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‏లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే తారక్ స్టేజ్ పైకి వెళ్తున్న సమయంలో ఓ అభిమాని హఠాత్తుగా వచ్చి ఆయనను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీంతో అప్రమత్తమైన బాడీగార్డ్స్ అతడిని వెనక్కు నెట్టే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే తారక్ తన సిబ్బందిని వారించి.. అభిమానితో సెల్ఫీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. తారక్ చేసిన పనికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న NTR 30 సినిమా పూజా కార్యక్రమాలు మార్చి 23న నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.