Tollywood Movies: ఎంటర్టైన్మెంట్ అస్సలు మిస్ అవ్వకండి.. ఈవారం థియేటర్లు/ ఓటీటీలో వచ్చే చిత్రాలు ఇవే..

ఇప్పుడు థియేటర్లలో.. ఓటీటీలలో చిన్న సినిమాలు సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే మరోవైపు ఓటీటీలలో ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. స్టార్ హీరోస్.. భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా ఈ వారం చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరీ అవెంటో తెలుసుకుందామా.

Tollywood Movies: ఎంటర్టైన్మెంట్ అస్సలు మిస్ అవ్వకండి.. ఈవారం థియేటర్లు/ ఓటీటీలో వచ్చే చిత్రాలు ఇవే..
Telugu Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 06, 2023 | 1:24 PM

వేసవి కాలం వచ్చేస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు పరీక్షల హడావిడిలో ఉన్నారు. దీంతో సమ్మర్ ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాక్సాఫీస్ వద్ద క్రేజీ మూవీస్ సందడి చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈక్రమంలోనే ఇప్పుడు థియేటర్లలో.. ఓటీటీలలో చిన్న సినిమాలు సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే మరోవైపు ఓటీటీలలో ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. స్టార్ హీరోస్.. భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా ఈ వారం చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరీ అవెంటో తెలుసుకుందామా.

సీఎస్ఐ. సనాతన్.

ఆది సాయి కుమార్, మిషా నారంగ్ జంటగా డైరెక్టర్ శివశంకర్ దేవ్ తెరకెక్కిస్తోన్న సినిమా సీఎస్ఐ. సనాతన్. హత్య కేసు పరిశోధన నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందిస్తునట్టు ఇటీవల విడుదలైన పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ట్యాక్సీ..

డైరెక్టర్ హరీష్ సజ్జా రూపొందిస్తూ స్వయంగా నిర్మిస్తోన్న సినిమా ట్యాక్సీ. ఇందులో వసంత్ సమీర్ పిన్నమరాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మేనన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది.

వాడు ఎవడు..

డైరెక్టర్ ఎస్. శ్రీనివాసరావు దర్శకత్వంలో కార్తికేయ, అఖిల నాయర్ జంటగా నటిస్తున్న సినిమా వాడు ఎవడు. సస్పెస్స్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ మార్చి 10న రిలీజ్ కానుంది.

నేడే విడుదల..

ఆసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటిస్తోన్న చిత్రం నేడే విడుదల. రామ్ రెడ్డి పన్నాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాతోపాటు.. హాలీవుడ్ చిత్రం 65 కూడా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఓటీటీ చిత్రాల విషయానికి వస్తే..

యాంగర్ టేల్స్..

డైరెక్టర్ వెంకటేశ్ మహా, సుహాస్, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య కీలకపాత్రలలో నటిస్తోన్న వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్. ప్రభల తిలక్ దర్శకుడు. ఈ సిరీస్ మార్చి 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. నచ్చని జీవితం ఎదురైన ఓ నలుగురు పడే మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు

రానా నాయుడు..

విక్టరీ వెంకటేశ్, రానా తండ్రీకొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్‏తో రానా, వెంకీ ఇద్దరూ ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సిరీస్ మార్చి 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

అలాగే నెట్‏ఫ్లిక్స్ లో రాబోతున్న మరిన్ని చిత్రాలు.. రేఖ మలయాళం మూవీ.. మార్చి 10న స్ట్రీమింగ్ కానుంది. అలాగే ద గ్లోరీ వెబ్ సిరీస్ 2 కూడా మార్చి 10న స్ట్రీమింగ్ కానుంది.

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ సిరీస్ అయిన హ్యాపీ ఫ్యామిలీ.. కండీషన్స్ అప్లయ్ మార్చి 10న స్ట్రీమింగ్ కానుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చాంగ్ కెన్ డంక్ మూవీ మార్చి 10న విడుదల కానుంది. దీంతోపాటు.. రన్ బేబీ రన్ సినిమాతో తెలుగు, తమిళ్ భాషల్లో మార్చి 10న విడుదల కానుంది. ఇక జీ5 ఓటీటీలో కన్నడ చిత్రం రామ్ యో… తమిళ్ సినిమా బొమ్మై నాయగి.. బంగ్లా సినిమా బౌడీ క్యాంటీన్ మార్చి 10న స్ట్రీమింగ్ కానున్నాయి.

అలాగే సోనీ లివ్ ఓటీటీలో తమిళ్ వెబ్ సిరీస్ యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో.. మలయాళం చిత్రం క్రిస్టీ.. తెలుగు సినిమా బ్యాడ్ ట్రిప్ మార్చి 10న స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తానికి ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు చిన్న సినిమాలు రెడీ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.