Rana-Naga Chaitanya: స్టార్ హీరోస్.. ఇప్పుడు నిర్మాతలయ్యారు.. ఆ వెబ్ సిరీస్ నిర్మిస్తోన్న రానా.. చైతన్య..

గౌతమి చల్లగుళ్ల అనే మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తోన్న ఈ సిరీస్ లో నరేష్ విజయకృష్ణ, ఝాన్సీ, ఇషా రెబ్బ, అదితి, రవి వర్మ, హరితేజ, నవదీప్, రాజా చెంబోలు, సునయన, హారిక తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Rana-Naga Chaitanya: స్టార్ హీరోస్.. ఇప్పుడు నిర్మాతలయ్యారు.. ఆ వెబ్ సిరీస్ నిర్మిస్తోన్న రానా.. చైతన్య..
Rana, Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2023 | 8:10 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో రానా దగ్గుబాటి, నాగచైతన్య. ప్రస్తుతం వీరు తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు హీరోలుగా వెండితెరపై సందడి చేసిన ఈ స్టార్స్.. ఇప్పుడు నిర్మాతలుగా మారారు. వీరిద్దరు కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. అదే స్పిరిట్ మీడియా. ముందుగా ఈ నిర్మాణ సంస్థను రానా ప్రారంభించి ఓ సిరీస్ నిర్మిస్తుండగా.. కథ నచ్చడంతో చైతూ కూడా ఇందులో భాగస్వామి అయ్యారు. వీరిద్దరు కలిసి నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ మాయాబజార్. గౌతమి చల్లగుళ్ల అనే మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తోన్న ఈ సిరీస్ లో నరేష్ విజయకృష్ణ, ఝాన్సీ, ఇషా రెబ్బ, అదితి, రవి వర్మ, హరితేజ, నవదీప్, రాజా చెంబోలు, సునయన, హారిక తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జెర్రీ సిల్వస్టర్ సంగీతం అందిస్తున్నారు.

మాయాబజార్ పేరుతో రాబోతున్న ఈ సిరీస్ ను గతేడాది సెప్టెంబర్ లోనే అనౌన్స్ చేసారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా మరోసారి ఈ సిరీస్ తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే రానా తన ఆరోగ్య సమస్యలపై స్పందించిన సంగతి తెలిసిందే. తనకు కుడి కన్ను కనిపించదని.. అలాగే కిడ్నీ మార్పు కూడా జరిగినట్లుగా తెలిపారు. అంతేకాకుండా.. తనకు కార్నియల్ మార్పిడి కూడా జరిగిందని.. దాదాపు తను టెర్మినేటర్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కొంతమంది శారీరక సమస్యల కారణంగా ఎంతో మానసికంగా కృంగిపోతారని… ఆ సమస్యలు పరిష్కరించబడినప్పటికీ తమపై ఎప్పటికీ ఓ భారం ఉంటుందని అన్నారు. ఎన్నో శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ తను ఇంకా బతికే ఉన్నానని.. కాలంతో మనం వెళ్తూ ఉండటమే అని అన్నారు రానా. ఇక ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే.