Pawan Kalyan: తనయుడు అకీరాతో క్రికెట్ ఆడుతూ పవన్ కళ్యాణ్.. ఈ ఫోటో అభిమానులు ఎప్పుడూ చూసుండరు..

పాలిటిక్స్, మూవీస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న పవర్ స్టార్ చిత్రాల కోసం కొంతకాలంగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Pawan Kalyan: తనయుడు అకీరాతో క్రికెట్ ఆడుతూ పవన్ కళ్యాణ్.. ఈ ఫోటో అభిమానులు ఎప్పుడూ చూసుండరు..
Pawan Kalyan, Akira
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 03, 2023 | 7:57 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పవన్ సినిమా వస్తే థియేటర్లలో రచ్చ జరగాల్సిందే. ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. అటు ఈ సినిమా కంప్లీట్ కాకముందే డైరెక్టర్ కమ్ నటుడు సముద్రఖని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా..డైరెక్టర్ హారిశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు పవన్. పాలిటిక్స్, మూవీస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న పవర్ స్టార్ చిత్రాల కోసం కొంతకాలంగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈ ఫోటో పంజా సినిమా షూటింగ్ సమయంలో తీసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ పిక్ నెట్టింటిని షేక్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ ముందు తన కుమారుడు అకీరా నందన్ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. వెనకాలే పవన్ తనయుడిని చూస్తూ ఎంతో మురిసిపోతూ చిన్నగా చిరునవ్వుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆరడుగులు పైగా ఉన్న అకీరా.. అప్పుడు చిన్నారిగా కనిపిస్తుండగా.. వెనక నుంచి పవన్ ముద్దుగా చూసుకుంటున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. చాలా కాలం తర్వాత పవన్, అకీరా ఇద్దరిని అలా సంతోషంగా చూడడంతో ఫ్యాన్స్ హ్యపీగా ఫీల్ అవుతున్నారు.

Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కళ్యాణ్… రేణ్ దేశాయ్ దంపతులకు అకీరా నందన్, ఆద్య ఇద్దరు సంతానం. ఇటీవల డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తోన్న వినోదయ సిత్తం రీమేక్ చిత్ర సెట్ లో కనిపించారు పవన్. తమ అభిమాన హీరో లేటేస్ట్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.