Priyanka Chopra: ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
ఇటీవల జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రిపుల్ ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు హాలీవుడ్ మేకర్స్. అయితే ఈ సినిమా తమిళ్ మూవీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.
ఆర్ఆర్ఆర్ .. ప్రపంచవేదికపై సత్తా చాటిన తెలుగు సినిమా. సినీ ప్రియులు.. నటీనటులు ఎప్పటికీ కళగా మిగిలిపోతుందనుకున్న ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. విశ్వవేదికపై ఎన్నో అవార్డ్స్ అందుకుని తెలుగు సినిమా స్థాయిని పెంచింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించింది. దాదాపు రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇటీవల జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రిపుల్ ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు హాలీవుడ్ మేకర్స్. అయితే ఈ సినిమా తమిళ్ మూవీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఇటీవల అమెరికన్ పోడ్ కాస్ట్ హోస్ట్ డాక్స్ షెపర్డ్కు ఇంటర్వ్యూ ఇచ్చింది ప్రియాంక.
ఇందులోనే హోస్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాను బాలీవుడ్ మూవీ అని పిలవగా.. కాదు అది తమిళ్ సినిమా అని సమాధానమిచ్చింది. దీంతో ప్రియాంక కామెంట్స్ పై మండిపడుతున్నారు నెటిజన్స్. నిజానికి ఆస్కార్ వేడుకలలో జక్కన్న.. కీరవాణి.. రామ్ చరణ్ ఉపాసన దంపతులతో కలిసి ఫోటోస్ దిగింది ప్రియాంక. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రియాంక మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో గొడ్డు మాంసం గురించి మాట్లాడింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు వ్యక్తులు స్టూడియోస్ అన్నింటిని నియంత్రిస్తున్నారని తెలిపింది. ఐదారుగు నటీనటులు పెద్ద పెద్ద సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. అన్నింటిలో మొదటిది స్ట్రీమింగ్. కంటెంట్ అందించేవారికి లైఫ్ ఇచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెందింది. అలాగే అక్కడ యాక్షన్ నుంచి ప్రేమకథ.. డ్యాన్స్ అన్ని రకాల సినిమాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే హోస్ట్ బాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అనగా.. వెంటనే ప్రియాంక మాట్లాడుతూ.. “అది తమిళ్ సినిమా.. అది పెద్ద బ్లాక్ బస్టర్ తమిళ్ మూవీ. అంటే మనకు అవెంజర్స్ లాంటింది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రియాంక మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. నార్త్ ఇండియన్స్ ఎప్పుడూ తెలుసుకుంటారు.. సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాలు ఉన్నాయని.. తెలుగు సినిమా కూడా ఉందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
@priyankachopra RRR is not a Tamil film It’s a Telugu film ?
— SURAJ (@ManepalliSuraj) March 29, 2023
Lol what a clown @priyankachopra she even hosted a pre oscars party to rrr team but don’t remember it’s original language ?
— Cherry (@vennelajabili) March 29, 2023
During an episode of the “Armchair Expert with Dax Shepard” podcast, Priyanka Chopra points out an interviewer’s mistake of labeling #RRR as a Bollywood movie, and clarifies that it is actually a Tamil film ? pic.twitter.com/tUuZ0wJ5rm
— LetsCinema (@letscinema) March 29, 2023
In conversation for a podcast the “Armchair Expert with Dax Shepard”#PriyankaChopra points out an interviewer’s mistake of labeling #RRR as a Bollywood film, and clarifies that it is actually a Tamil film
North People always find South as Tamil & Sambarpic.twitter.com/4uaJyAmJ8A
— Vishnu Bekaar (@TheVishnuBekaar) March 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.