Dasara: నానిరా బై ఇక్కడ.. దసరా సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. కళ్లు తేలేయాల్సిందే..
ఈ మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వనుంది.
దసరా సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు సిద్దమయ్యాడు నేచురల్ స్టార్ నాని. ఈ సారి ఈ కుర్ర హీరో కన్ను పాన్ ఇండియా మార్కెట్‌పై పడింది. కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసినప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు నాని. ఈ సినిమా మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అవ్వనుంది. ప్రమోషన్స్‌లో కూడా దుమ్ములేపుతున్నాడు నాని. దేశమంతా తిరిగేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని డైరెక్ట్ చేయగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. పాటలు, టీజర్స్, ట్రైలర్‌తో సినిమాకు మాంచి బజ్ అయితే వచ్చింది. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.
ఇక సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు దక్కించుకున్నాడు 2 సంస్థలు. తెలుగుతో కన్నడ, తమిళం, మలయాళం భాషలకు చెందిన స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకోగా.. హిందీ స్ట్రీమీంగ్ రైట్స్‌ను హాట్ స్టార్ దక్కించుకున్నట్లు తెలిసింది. సినిమా రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. ఇంకో ఇంటస్ట్రింగ్ న్యూస్ ఏంటంటే.. మూవీ క్లైమాక్స్ కోసమే 5 కోట్లు ఖర్చు చేశారట.
ఇక దసరా సినిమా కోసం నాని రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈసినిమా కోసం నాని 20 కోట్ల రూపాయల రేంజ్లో పారితోషకం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇకపై నాని అంటే టాలీవుడ్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్టార్ మరి.. ఆ మాత్రం ఉండొద్దా అంటున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..