Keerthy Suresh: దసరా ప్రమోషన్లలో తెల్ల చీరలో దేవకన్యల మెరిసిన కీర్తి సురేష్.. ఆ సారీ ధర ఎంతంటే..

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కీర్తి .. తెల్ల చీరలో అచ్చం దేవకన్యల మెరిసింది. చమ్కీల అంగిలేసి అన్నట్టుగా.. చమ్మీల చీరలో అందరిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Keerthy Suresh: దసరా ప్రమోషన్లలో తెల్ల చీరలో దేవకన్యల మెరిసిన కీర్తి సురేష్.. ఆ సారీ ధర ఎంతంటే..
Keerthy Suresh Saree
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2023 | 10:42 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తోన్న కథానాయికలలో కీర్తి సురేష్ ఒకరు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కొద్ది రోజులుగా ఈ అమ్మడు దసరా మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదేలు దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో మార్చి 30న విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కీర్తి .. తెల్ల చీరలో అచ్చం దేవకన్యల మెరిసింది. చమ్కీల అంగిలేసి అన్నట్టుగా.. చమ్మీల చీరలో అందరిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కీర్తి సురేష్ ధరించిన ఈ చికెన్ హరి సారీ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఈ చీర ఖరీదు దాదాపు లక్ష వరకు ఉంటుందని తెలుస్తోంది. చీరల విషయంలో కీర్తి ఎప్పుడూ సంప్రదాయ నేతలను ఇష్టపడుతుందని సన్నిహితులు అంటున్నారు. తాజాగా దసరా ప్రమోషన్లలో ఆమె ఐవరీ జార్జెట్ క్లౌడ్ ప్యాటర్న్ చికంకరి చీరను ధరించింది. అలాగే సీక్విన్స్ , మిర్రర్ వర్క్ డిటెయిలింగ్ చీరను అదే అలంకరించబడిన వర్క్ స్ట్రాపీ బ్లౌజ్‌తో జత చేయడంతో ప్రిన్సెస్ లా కనిపిస్తోంది. అలాగే అర్చా మెహతా స్టైల్‌గా, ఆమ్రపాలి జ్యువెల్స్ జతచేయడంతో పాతిరాతి శిల్పానికి ప్రాణమొచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కీర్తి సురేష్ దసరా చిత్రంలోనే కాకుండా.. భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి,మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తోన్న ఈ మూవీలో కీర్తి చిరు చెల్లిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.