Tollywood: ఈ ఫోటోలోని చిన్నోడు ఇప్పుడు విలక్షణ నటుడు.. అతడి వాయిస్ గర్జనలా ఉంటుంది.. గుర్తుపట్టారా..?
అతడి వాయిస్‌లో చాలా డెప్త్ ఉంటుంది. నటనలో కూడా చాలా పరిణితి ఉంటుంది. అందుకే ఇతడికి తెలుగు ప్రేక్షకల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
తెలుగు ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు ఉన్నారు. వారు ఇప్పుడు సరైన కథలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మంచి స్క్రిప్ట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు హీరోలు అయితే తామే రచయితలుగా, దర్శకులుగా మారి సినిమాలు తీస్తున్నారు. విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్ వంటి వారు ఈ కోవలోకే వస్తారు. అయితే ఓ హీరో మాత్రం ఇండస్ట్రీకి వచ్చినప్పుటి నుంచే విభిన్నమైన కథలతో తనకంటూ ఓ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. పైన ఫోటోలోని చిన్నోడే ఆ హీరో. మీరు గుర్తుపట్టగలరా..? చాలా కష్టం లేండి. మీకు ఓ క్లూ ఇస్తాం ట్రై చేయండి. ఆ హీరో మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దగ్గరి బంధువు. నూటికి 90 శాతం మందికి ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది.
అవును.. మీరు అనుకున్నది కరెక్టే.. ఆ హీరో నారా రోహిత్. తెలుగు ప్రేక్షకుల్లో రోహిత్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అదేమీ అతడు నారా కుటుంబం నుంచి వచ్చాడని కాదు. అతను చేసిన సినిమాల వల్ల. అవును… బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద వంటి సినిమాలు అతడికి మంచి పేరు సంపాదించాయి. కొన్ని సినిమాలు కమర్షియల్ హిట్ అవ్వనప్పటికీ.. అతడికి మాత్రం గుర్తింపు తెచ్చాయి. నారా రోహిత్ ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ స్థాపించి పలు సినిమాలు కూడా నిర్మించాడు. అతడి వాయిస్‌లో భలే బేస్ ఉంటుంది. ఆయన గాత్రానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
గత నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు రోహిత్. టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఆయన మళ్లీ సినిమాలు చేసి.. ఎంటర్టైన్ చేయాలని ఫ్యాన్స్ అయితే గట్టిగా కోరుకుంటున్నారు. మరి రోహిత్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. కాగా పైన ఫోటోలో రోహిత్‌ను ఎత్తుకుంది.. ఆయన తండ్రి.. నారా రామ్మూర్తి నాయుడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..