Brahmamudi, August 19th episode: రణ రంగంగా మారిన దుగ్గిరాల ఫ్యామిలీ.. కావ్యని బయటకు గెంటేసిన రాజ్.. అసలేం జరుగుతుంది!!
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యపై అపర్ణకి లేనిపోనివి చెప్పి అగ్గి రాజేస్తుంది రుద్రాణి. ఆగ్రహంతో రగిలిపోతున్న అపర్ణ.. రాజ్ కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని సీరియస్ గా అరుస్తుంది. ఏమైంది మమ్మీ.. ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు రాజ్. ఏ చెప్తే కానీ రావా.. అని అపర్ణ అంటుంది. సరే వస్తున్నా అంటాడు రాజ్. నా కొడుకు చేత మట్టి తొక్కిస్తుందా.. అని రగిలిపోతూ ఉంటుంది. ఇక కావ్య ఇంటికి వస్తుంది. రాగానే అందరి ముందూ నిలబెడుతుంది అపర్ణ. ఈ రోజు నేను ఏం నేరం చేశాను అని అడుగుతుంది కావ్య. నా కొడుకును ఎవరు అనుకుంటున్నావ్? ఏం అనుకుంటున్నావ్? నా కొడుకు దుగ్గిరాల వంశానికి మహా రాజు..
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యపై అపర్ణకి లేనిపోనివి చెప్పి అగ్గి రాజేస్తుంది రుద్రాణి. ఆగ్రహంతో రగిలిపోతున్న అపర్ణ.. రాజ్ కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని సీరియస్ గా అరుస్తుంది. ఏమైంది మమ్మీ.. ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు రాజ్. ఏ చెప్తే కానీ రావా.. అని అపర్ణ అంటుంది. సరే వస్తున్నా అంటాడు రాజ్. నా కొడుకు చేత మట్టి తొక్కిస్తుందా.. అని రగిలిపోతూ ఉంటుంది. ఇక కావ్య ఇంటికి వస్తుంది. రాగానే అందరి ముందూ నిలబెడుతుంది అపర్ణ. ఈ రోజు నేను ఏం నేరం చేశాను అని అడుగుతుంది కావ్య. నా కొడుకును ఎవరు అనుకుంటున్నావ్? ఏం అనుకుంటున్నావ్? నా కొడుకు దుగ్గిరాల వంశానికి మహా రాజు.. స్వరాజ్ ఇండస్ట్రీస్ కి మేనేజింగ్ డైరెక్టర్.. తెలుసా నీకు ఆ విషయం అని అపర్ణ.. కావ్యని అడుగుతుంది. తెలుసు అని కావ్య చెప్తుంది.
తెలిసి నువ్వు వాడిని నీ స్థాయికి దిగజారుస్తున్నావా.. అని అంటుంది అపర్ణ. నాదంత నీచ స్థాయి ఏమీ కాదు అత్తయ్యా.. అయినా దిగజార్చడం అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని నిలదీస్తుంది. నేరం ఏంటో చెప్పకుండా నిందించడం కరెక్ట్ కాదు అని కావ్య అంటుంది. నీకు నేను స్థాయి భేదాలు నేర్పాలా? నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండక.. నీ నిరుపేద స్థాయికి నా కొడుకును కూడా లాగుతున్నావ్? ఎందుకు వాడి చేత అడ్డమైన పనులు చేయిస్తున్నావ్? అని అపర్ణ అడగ్గా.. ఏం చేయించానని కావ్య అడుగుతుంది. నీతో పాటు మట్టి తొక్కించావా? లేదా? అని అపర్ణ అడుగుతుంది. ఈ లోపు రుద్రాణి ఎంటర్ అవ్వగా.. ఓహో అక్కడ ఒక దృష్టి పెట్టారన్నమాట అని కావ్య చెప్తుంది. ఎవరు? అని రుద్రాణి అడగ్గా.. మీరో మీ అబ్బాయో అని అంటుంది కావ్య. రుద్రాణి గారూ మీకు వినోదం కావాలి కదా.. పూటకో కారణం సృష్టించి నేను ఇంట్లోకి రాగానే.. మా అత్తయ్య గారిని రెచ్చగొట్టి.. ఏమీ ఎరగనట్టు భలే నిలబడతారు మీరూ.. మీ కొడుకు అని కావ్య సెటైర్ వేస్తుంది. అసలు నువ్వు ఏం చేశావో తెలుసా? అని రుద్రాణి అడగ్గా.. అసలు నేను చేసిన నేరం ఏంటి? రోజూ ఇంటికి రాగానే దోషిగా నిలబెట్టి ఈ రచ్చ ఏంటి? నా మానాన్న నేను వెళ్లి.. మా నాన్నకు సహాయం చేసి వస్తుంటే.. ఇన్ని ఆంక్షలా.. ఇంత రచ్చ చేయాలా? అని నిలదీస్తుంది.
నువ్వు ఏ మట్టిలోనైనా మునిగి తేలు మాకు అనవసరం.. నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన రాజ్ చేత ఎందుకు మట్టి తొక్కించాలి అని అపర్ణ ప్రశ్నిస్తుంది. వదినా కాస్త అలుసు ఇస్తే.. అల్లుడి చేత కూడా బొమ్మలు చేయించి.. అమ్మించగలరు అని రుద్రాణి అనగా.. కోపంతో అరుస్తుంది కావ్య. నాకు నా భర్త అంటే గౌరవం ఉంది. దుగ్గిరాల వంశ వారసుడనే కాదు.. నా భర్తగా కూడా నేను గౌరవం ఇస్తాను. అసలు నాకు తెలీక అడుగుతున్నాను.. ఆ మీడియాకు వేరే వార్తలే లేవా.. మా ఇంటి చుట్టే ఎందుకు తిరుగుతున్నారు? మా ఇద్దరి మీదనే ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? వరుసగా జరిగే ఈ గొడవలన్నింటికీ కారణమే మీరూ, మీ కొడుకు అని కావ్య.. రుద్రాణిపై రెచ్చిపోతుంది. దీంతో అసలు విషయం తెలిసిందా అని రుద్రాణి, రాహుల్ లు షాక్ అవుతారు.
ఈలోగా ఈ నిజాల వెనుక ఉన్న నీ ఆంతర్యం ఏంటో నాకు తెలుసు అని అంటుంది అపర్ణ. ఏంటి అత్తయ్యా.. వీరు తెలుసుకున్న ఆంతర్యం ఏంటి? అని కావ్య అడుగుతుంది. ఈ ఇంటి పెద్దల మంచితనాన్ని, ఔదార్యాన్ని అడ్డం పెట్టుకుని నువ్వ వెళ్లి నీ ఇంటి ముందు మట్టిలో తైతక్కలాడినా నాకు అనవసరం. కానీ నా కొడుకును పావుగా మార్చి.. మీ కుటుంబంలో కలిపేసి.. ఒక మట్టి మనిషిగా తాయారు చేసి.. కూలివారితో సమానంగా మారిస్తే మాత్రం నిన్ను నేను క్షమించేదే లేదు అని అపర్ణ అంటుంది. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి అత్తయ్యా? నేను డిజైన్స్ వేసి ఆ డబ్బును మా ఇంటికి తీసుకెళ్లి ఇస్తే మీకు నచ్చదు. పోనీ మా ఆయన నన్ను వెనకేసుకొచ్చి ఇలాంటి వాళ్ల ముందు సమర్దిస్తే మీరు తట్టుకోలేరు. ఎక్కడ భార్యగా ఒప్పేసుకుంటారోమోనని భయం. ఎక్కడ మేమిద్దరం ఒక్కటైపోతామోనని భయం. ఏదైనా చిన్న తప్పు జరిగితే అది మీ కొడుకు చూపించి.. నన్ను మాటలు అనేంత వరకూ మీరు నిద్రపోరు. మీకు నేను ఎప్పటికీ కోడలిగా పనికిరాను. అంటే మీరే మీ కొడుకు కాపురాన్ని ముక్కలు చేసి, మీ పెద్దరికాన్ని నిలుపుకోవాలనుకుంటున్నారా? మా ఇద్దర్నీ విడదీసి, నన్ను బయటకి గెంటేసి మీ కసి తీర్చుకోవాలి అనుకుంటున్నారా? అసలు మీరు మీ కొడుక్కు కన్న తల్లేనా? అని కావ్య నిలదీస్తుండగా.. ఈలోగా వచ్చిన రాజ్.. కావ్య మాటలు విని.. కొట్టేందుకు చేయి లేపుతాడు.
ఈ సీన్ కట్ చేయగా.. వర్షం పడేలా ఉంది బొమ్మలు తీయాలని కనకాన్ని పిలుస్తాడు కృష్ణమూర్తి. హా వస్తున్నా అండి అంటూ హడావిడిలో బొమ్మను పగలకొడుతుంది కనకం. అయ్యో దేవుడి విగ్రహం పగిలిపోయింది అంటూ కనకడం బాధపడగా.. నువ్వు కావాలని చేయలేదు కదా అని కృష్ణమూర్తి అంటాడు. ఏమోనండి నాకు ఏదో కీడు జరుగుతుందేమోనని భయంగా ఉందని కనకం మదనపడుతుంది.
నెక్ట్స్.. ఏమన్నావ్.. మా అమ్మను ఏం అంటున్నావ్? అంటూ.. కావ్యపై చిందులేస్తాడు రాజ్. నేను నిజమే మాట్లాడుతున్నా.. నేను ఈ ఇంట్లో ఉండటం మీ అమ్మగారికి ఇష్టం లేదు అని కావ్య అనగా.. అవునా నేను చెప్తున్నా.. నువ్వు మా ఇంట్లో ఉండటం నాకూ ఇష్టం లేదు అని అంటాడు రాజ్. దీంతో ఇది విన్న కావ్య, ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. రాజ్ ఇదంత పెద్దది చేయకురా అని ప్రకాశం అనగా.. ఇదంతా ఆ రుద్రాణి పెట్టిన మంట అని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మి నన్ను అంటే ఊరుకోను అని రుద్రాణి జవాబు ఇస్తుంది. ఆపండి ఇది నాకు మా అమ్మకు, ఈ కళావతికి జరిగే మధ్య గొడవ. నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకో లేదు. కానీ ఈ ఇంటి పెద్దవాళ్లు చెప్పినందుకు నిన్ను గదిలోకి రానిచ్చాను. అన్నింటికీ ఈ ఇంటి పెద్దవాళ్లను అడ్డం పెట్టుకుని నీ హక్కులంటూ ఎన్నో సాధించుకున్నావ్. అవును నిజమే నువ్వు నాకు భార్యగా నచ్చనప్పుడు..నిన్ను మా అమ్మ కోడలిగా ఎందుకు ఒప్పుకోవాలి? కానీ నువ్వేం చేశావ్.. నీ పుట్టిల్లు, నీ ఆర్థిక సమస్యలు, నీ ఆత్మ గౌరవం అంటూ గొడవులు పెడుతున్నావ్. ఈ ఇంటికి మహారాణిలా బ్రతికింది మా అమ్మ. ఇన్నాళ్లు నేను అన్నింటినీ నేను సహించాను. కానీ నువ్వు మా అమ్మనే అనే స్టేజ్ కి వెళ్లావ్.. నీలాంటి వాళ్లను ఎక్కడ ఉంచాలో.. అక్కడే ఉంచాలి. నీకు ఈ ఇంట్లో స్థానమే లేదు. వెళ్లు.. వెళ్లిపో. ఇందులో ఎవరు జోక్యం చేసుకున్నా.. నాకు నచ్చదు చెప్తున్నా అంటూ కావ్యని బయటకి గెంటేస్తాడు రాజ్.
నా ఇల్లు ఇదే అని కావ్య అనగా.. పరాయివాళ్లకు మా ఇంట్లో స్థానం లేదని రాజ్ అంటాడు. నేను ఎక్కడికీ వెళ్లను.. ఇక్కడే ఉంటాను.. నేను ఈ గడప దగ్గరే ఉంటాను అంటూ కావ్య అక్కడనే నిల్చుంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే.. వీధిలోకి గెంటేస్తాను అంటూ కర్కశంగా మాట్లాడతాడు రాజ్. మా అమ్మని ఎదిరిస్తే.. నేను మా వంశ పరువు, ప్రతిష్టలు కూడా చూడను. అయిపోయింది.. ఇవాళ్టితో.. ఈ ఇంటితో నీకు రుణం తీరిపోయింది అని రాజ్ అనగా.. కావ్య షాక్ అయి నిల్చొని చూస్తుంది. మీరైనా సర్తి చెప్పొచ్చు కదా.. అని ఇందిరా దేవి అనగా.. ఈ ఇంట్లో పెద్దరికం పేరుతో చాలా జరుగుతున్నాయ్.. నువ్వు పోగొట్టుకున్న పెద్దరికం చాలదా.. అని సీతారామయ్య అంటాడు. కావ్యని బయటకు గెంటేసి ఇంటి తలుపులు వేసేస్తాడు రాజ్. ఈ రోజుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్లీ సోమవారం ఎపిసోడ్ తో కలుద్దాం.