Brahmamudi, August 16th Episode: రాజ్ ని ఓ ఆట ఆడుకున్న కావ్య.. ఫ్రస్టేషన్ లో స్వప్న!!

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో బాత్రూమ్ ముందు రాజ్ నూనె పోసిన వీడియోను చూపించి కావాలని రాజ్ ని బెదిరిస్తుంది కావ్య. దీంతో రాజ్ కావ్యని తిట్టుకుంటాడు. ఈ సీన్ కట్ చేస్తే..లెటర్ రాసిన అమ్మాయిని వెతికేందుకు తెగ ప్రయత్నాలు చేస్తాడు కళ్యాణ్. ఫోన్ నెంబర్ బట్టి అడ్రస్ వెతుక్కుని.. కళ్యాణ్, అప్పు వస్తారు. కట్ చేస్తే అక్కడ పిచ్చి ఆస్పత్రి ఉంటుంది. అది చూసి వారిద్దరూ షాక్ అవుతారు. దీంతో అప్పు.. కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ ఉంటాడు. సరే అని లోపలికి వెళ్తారు. ఇక డాక్టర్ తో కళ్యాణ్ సరదా సంభాషణ ఉంటుంది. ఇదంతా చూసి అప్పు నవ్వుకుంటూ..

Brahmamudi, August 16th Episode: రాజ్ ని ఓ ఆట ఆడుకున్న కావ్య.. ఫ్రస్టేషన్ లో స్వప్న!!
Brahmamudi
Follow us
Chinni

|

Updated on: Aug 16, 2023 | 9:06 PM

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో బాత్రూమ్ ముందు రాజ్ నూనె పోసిన వీడియోను చూపించి కావాలని రాజ్ ని బెదిరిస్తుంది కావ్య. దీంతో రాజ్ కావ్యని తిట్టుకుంటాడు. ఈ సీన్ కట్ చేస్తే..లెటర్ రాసిన అమ్మాయిని వెతికేందుకు తెగ ప్రయత్నాలు చేస్తాడు కళ్యాణ్. ఫోన్ నెంబర్ బట్టి అడ్రస్ వెతుక్కుని.. కళ్యాణ్, అప్పు వస్తారు. కట్ చేస్తే అక్కడ పిచ్చి ఆస్పత్రి ఉంటుంది. అది చూసి వారిద్దరూ షాక్ అవుతారు. దీంతో అప్పు.. కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ ఉంటాడు. సరే అని లోపలికి వెళ్తారు. ఇక డాక్టర్ తో కళ్యాణ్ సరదా సంభాషణ ఉంటుంది. ఇదంతా చూసి అప్పు నవ్వుకుంటూ ఉంటుంది. ఈలోపు ఆ లెటర్ అమ్మాయి.. డాక్టర్ కి మరో లెటర్ ఇస్తుంది. అందులో నా నెంబర్ నుంచి నీకు ఫోన్ చేస్తానని ఎలా అనుకున్నావు.. నా నుంచి నీకు లెటర్ వచ్చేలా చేశావు కదా.. అలాగే ఫోన్ నెంబర్ కూడా వచ్చేలా చూసుకో అని చెబుతుంది. అది చదవిని కళ్యాణ్.. అయితే మళ్లీ కవిత రాయాలన్న మాట.. అని అంటాడు. ఇది విన్న అప్పు అమ్మో.. మళ్లీ కవిత రాస్తావా.. రా అని అంటుంది.

ఇక ఈ సీన్ కట్ చేస్తే.. వాళ్ల పుట్టింటికి వెళ్లేందుకు బయలు దేరిన కావ్య.. సీతారామయ్య, ఇందిరా దేవి దగ్గరకు వచ్చి.. నా వ్యక్తిత్వాన్ని, వ్యక్తి గత నిర్ణయాన్ని సమర్థించి నాకూ ఉనికి ఉందని అందరికీ అర్థం అయ్యేలా చేశారు. ఇంత సంతోషంగా ఉన్నాను అంటే.. దానికి కారణం మీరే.. ఆశీర్వదించి పంపించండి.. అని వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. ఇందిరాదేవి మాట్లాడుతూ.. కంటే కూతుర్నే కనాలి అని ఎవరు అన్నారో గానీ.. నిన్ను చూస్తుంటే.. నీ లాంటి కూతురు నాకు లేదే అన్న వెలితి కనిపిస్తోందమ్మా.. నిజంగా మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. మేమమంతా నిన్ను అపార్థం చేసుకున్నాం.. చివరికి నువ్వే గెలిచావ్ అని అంటుంది. మీ పుట్టింట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారు అంటే.. సంతోషంతో ఇచ్చేవాడిని. కానీ నువ్వు చేయి చాచి ఆశించలేదు. నీ కష్టంతోనే డబ్బు ఇవ్వాలి అనుకున్నావు. ఇలాంటి ఆస్థి.. ఎన్నటికీ కరిగిపోదమ్మా.. అని కావ్యని ఆశీర్వదిస్తాడు సీతారామయ్య.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కావ్య ఆటో బుక్ చేసుకునేందుకు ఫోన్ చేయబోతే.. సీతారాయ్య.. ఆటో ఎందుకు అమ్మా.. రాజ్ నిన్ను కారులో తీసుకెళ్తాడు అని చెప్పాడు. ఈలోపు అపర్ణ చిర్రుబుర్రులాడుతూ.. మా అమ్మానాన్నల్ని చూడాలి అది.. ఆరోజు నేను అడ్డుపడితే.. నా మాటను తీసి పడేశారు. అదుగో అక్కడ పడింది బీజం. ఆ ఇంటికి.. ఈ ఇంటికి రాకపోకలు మొదలయ్యాయి. ఆ ఇంట్లో గీసిన అగ్గిపుల్లతో.. ఈ ఇంట్లో చిచ్చు రాజుకునేలా చేసింది.. ఈ అద్భుతమైన కళాకారిణి. అన్నీ ఒక ఎత్తు.. ఇప్పుడు డ్రాప్ చేయడానికి నా కొడుకు ఉన్నారుగా అంటున్నారు.. అదొక ఎత్తు.. మీ ముందే ఆటో బుక్ చేసుకుంటూ.. తన అవసరాన్ని చెప్పకనే చెప్పింది అంటూ నోరు పారేసుకుంటుంది. ఫర్వాలేదు అత్తయ్యగారూ నేను బయట నుంచి ఆటో బుక్ చేసుకుని వెళ్తాను అని కావ్య అంటుంది. అదేంటమ్మా.. నువ్వు ఈ ఇంటి కోడలివి.. నీకు సర్వాధికారాలు ఉంటాయి. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా నువ్వు దర్జాగా కారులోనే వెళ్లొచ్చు అని సుభాష్ అంటాడు. రాజ్ ఇక నుంచి నీ భార్యని నువ్వే కారులో డ్రాప్ చేయాలి.. అని సీతారామయ్య చెప్తాడు.

ఇక కారులో కావ్యని తీసుకుని వెళ్తాడు రాజ్. ఇక కావ్య కావాలని రాజ్ ని రెచ్చగొట్టేలా సరదాగా ఆటపట్టిస్తూ ఉంటుంది. సావిత్రిలా మాట్లాడుతూ.. కన్నాంబలా రెచ్చిపోతుందని రాజ్ అంటాడు. మీరు ఆయిల్ పోసి.. నన్ను బెడ్ పడేలా చేసేవారు అంటూ దెప్పిపొడుస్తుంది కావ్య. వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి.. ఆట పట్టిస్తూ మాట్లాడతాడు. దీంతో సైలెంట్ గా రాజ్ మాట్లాడుతాడు. ఇదంతా చూస్తూ కావ్య ఏంటండి.. వెనకాల ఎవరు ఉన్నారు అంటూ అని అడుగుతుంది. అబ్బే ఏమీ లేదు అని అంటాడు రాజ్. ఇక రాజ్ అంతరాత్మ ఏమో.. కావ్యని పొగుడుతూ రాజ్ ని ఏడిపిస్తాడు. ఇదిలా నడుస్తూ ఉండగా.. ఆ మాటల్లోనే కృష్ణమూర్తి ఇంటికి చేరుకుంటారు.

ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్న ఫోన్ లో మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ కోసం తొందర పడుతూ ఉంటుంది. కొంచెం టైమ్ పడుతుంది.. అంటూ స్వప్న ఫ్రెండ్ సాక్షి అంటుంది. దీంతో స్వప్న ఆలోచిస్తూ ఫ్రస్టేషన్ అవుతుంది. కట్ చేస్తే.. రాహుల్ గదిలోకి వస్తాడు. ఏంటి.. ఇందాక ఫోన్ లో మాట్లాడుతూ నీ మాటలు పట్టించుకోలేదు.. ఏమైంది అని అడుగుతాడు. నా ప్రాబ్లమ్ ఇదే.. నా నాది కోపమో.. కంగారో లేదో కూడా తెలీడం లేదా? నీకు అని అడుగుతుంది. రాజ్ అలానే చేస్తున్నాడా అని ప్రశ్నిస్తుంది. కావ్య అడగకపోయినా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లాడు. నీలో ఆ ప్రేమ ఉందా అని స్వప్న నిలదీస్తుంది.

దీంతో రాహుల్ ఫ్రస్టేషన్ అవుతాడు. రాజ్ ఎందుకు పోల్చుతున్నావ్ నువ్వు? అందులోనూ నాకు ఇంట్లో అంత వ్యాల్యూ లేదు.. నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాక.. ఉన్నది కూడా పోయింది అని అంటాడు. అసలు ఆ రోజు హోటల్ లో నీతో కలవక పోయి ఉంటే.. ఈ సమస్య అంతా వచ్చేది కాదు. అయినా దీనికంతటికి కారణం నీ ప్రెగ్నెన్సీనే. తప్పు నేనే చేశాను. అందుకే అనుభవిస్తున్నా అని అంటాడు. నువ్వే కాదు నేనూ అనుభవిస్తున్నా.. కడుపుతో పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం వల్ల కావ్యకి దక్కుతున్న మర్యాద నాకు దక్కడం లేదు అని అంటుంది స్వప్న. నీకు కడుపే లేకపోతే.. అసలు నిన్ను పెళ్లే చేసుకునేదాన్ని కాదు అని అంటాడు రాహుల్. ఆ తర్వాత కోపంతో అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఈ సీన్ కట్ చేస్తే.. సేటుకు డబ్బు ఎలా కట్టాలి అంటూ ఆలోచిస్తారు కృష్ణమూర్తి, కనకం. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.