Guess The Actress: ఫోటో అనగానే సిగ్గుపడుతూ దాగున్న ఈ అందం ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అండి బాబు.

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో నేరుగా మాట్లాడే రోజులు వచ్చేశాయ్‌. ఒకప్పుడు కేవలం పత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా తమ అభిమాన నటీ,నటులు...

Guess The Actress: ఫోటో అనగానే సిగ్గుపడుతూ దాగున్న ఈ అందం ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అండి బాబు.
Guess The Actress
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 04, 2023 | 3:38 PM

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో నేరుగా మాట్లాడే రోజులు వచ్చేశాయ్‌. ఒకప్పుడు కేవలం పత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా తమ అభిమాన నటీ,నటులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకునే వారు. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియాలో వచ్చేసిందో, సినీ తారలే నేరుగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తమ సినిమా విశేషాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టాలీవుడ్‌ బ్యూటీ ఒకరు తన లేటెస్ట్ ఫొటోలను షేర్‌ చేసింది.

పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ సుందరి ఎవరో గుర్తుపట్టారా.? ఫొటో తీస్తుంటే సిగ్గుపడుతూ చేయి అడ్డం పెట్టుకున్న ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో మాములు క్రేజ్‌ లేదు. సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే ఈ బ్యూటీ తనపై వచ్చే ట్రోలింగ్స్‌ను చీల్చి చెండాడుతుంది. అందుకే ఈమెను ఫైర్‌ బ్రాండ్‌గా పిలుచుకుంటారు. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఇప్పుడు ఏకంగా సినిమాల్లో నటించే స్టేజ్‌కు చేరుకుంది. ఇపాటికే ఈమె ఎవరో ఒక క్లారిటీ వచ్చేసింది కదూ.! అవును మీ గెస్‌ నిజమే. ఈమె మరెవరో కాదు అందాల అనసూయే. కెరీర్‌లో సక్సెస్‌ కావడానికి సమయంతో సంబంధం లేదని చెప్పడానికి అనసూయ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. పెళ్లి అవ్వగానే కెరీర్‌ ముగిసింది అనుకునే ఎంతో మందికి అనసూయ స్ఫూర్తిదాయకం.

ఇవి కూడా చదవండి

ఒక న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా ఉమెన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో హీరోయిన్‌గా నటించే స్థాయికి ఎదిగింది అనసూయ. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె లక్షణం, చెరగని అందం ఆమెను నిత్యం న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలుపుతున్నాయి. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి మొహంమాటం లేకుండా అభిమానులతో పంచుకునే ఈ బ్యూటీ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. పొట్టి నిక్కర్‌లో ఇంట్లో రిలాక్స్‌ అవుతున్న సమయంలో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేసిన అనసూయ..’లాంగ్‌ వీకెండ్‌ ఇలా సాగుతోంది’ అన్న అర్థం వచ్చే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. దీంతో అనసూయ లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..