Allu sneha reddy: అల్లు స్నేహా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదన్నమాట.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో.
సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తారనేది చాలా మంది అభిప్రాయం. అయితే ప్రస్తుతం కేవలం స్క్రీన్‌పై కనిపించే వారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిలో..
సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తారనేది చాలా మంది అభిప్రాయం. అయితే ప్రస్తుతం కేవలం స్క్రీన్‌పై కనిపించే వారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి మొదటి వరుసలో ఉంటారు. అల్లు అర్జున్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకునే స్నేహా రెడ్డి.. తన వ్యక్తిగత విషయాలను సైతం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు.
ముఖ్యంగా తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం స్నేహాకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. 2023కి తన ఫిట్‌నెస్ గోల్స్ ఇవేనంటూ ఓ వీడియోను షేర్ చేశారు. బరువు తగ్గడం కాదు శక్తివంతం కావాలనుకుంటున్నాంటూ, భౌతిక ఆరోగ్యానికి బదులు ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందాలనుకుంటున్నట్లు తన ఫిట్‌నెస్ జర్నీని షేర్ చేశారు స్నేహా రెడ్డి. ఈ వీడియోతో పాటు.. ‘సన్నగా ఉండడం ఫిట్‌గా ఉండడం రెండూ ఒకటే కాదు. ఫిట్‌నెస్ అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించినది. ఈ సంవత్సరం నేను నా ఫిట్‌నెస్ జర్నీని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాను’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ రాసుకొచ్చారు.
View this post on Instagram
ఇదిలా ఉంటే సెలబ్రిటీల వైఫ్స్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వారిలో స్నేహారెడ్డి ముందువరుసలో ఉంటారు. ప్రస్తుతం స్నేహాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8.8 మిలియన్ల మంది ఫాలో అవుతుండడం విశేషం. ఆమె మాత్రం కేవలం 568 మంది ఫాలో అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..