SSC GD Constable Final Results: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 50,187 కానిస్టేబుల్ జీడీ తుది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్‌ చేసుకోండి..

గతేడాది నవంబర్‌లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసిన 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల నోటిఫికేషన్‌కు సంబంధించిన రాత పరీక్ష తుది ఫలితాలు ఆదివారం (ఆగస్టు 20) విడుదలయ్యాయి. ఈ మేరకు సాయుధ బలగాల్లో కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి తుది ఫలితాలను విడుదల చేసినట్లు ఈ మేరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆధికారిక ప్రకటన వెలువరించింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు..

SSC GD Constable Final Results: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 50,187 కానిస్టేబుల్ జీడీ తుది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్‌ చేసుకోండి..
SSC GD Constable 2023 Final Results
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 20, 2023 | 8:49 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 20: గతేడాది నవంబర్‌లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసిన 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల నోటిఫికేషన్‌కు సంబంధించిన రాత పరీక్ష తుది ఫలితాలు ఆదివారం (ఆగస్టు 20) విడుదలయ్యాయి. ఈ మేరకు సాయుధ బలగాల్లో కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి తుది ఫలితాలను విడుదల చేసినట్లు ఈ మేరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆధికారిక ప్రకటన వెలువరించింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జులైలో మెడికల్‌ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. రిజర్వేషన్‌ ఆధారంగా సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధుల తుది వివరాలను ఎస్సెస్సీ విడుదల చేసింది. ఇక ఇప్పటికే పీఈటీ/పీఎస్‌టీ ఫలితాలు జులైలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో బీఎస్‌ఎఫ్‌లో 21,052 పోస్టులు, సీఐఎస్‌ఎఫ్‌లో 6,060 పోస్టులు, సీఆర్‌పీఎఫ్‌లో 11,169 పోస్టులు, ఎస్‌ఎస్‌బీలో 2,274 పోస్టులు, ఐటీబీపీలో 5,642 పోస్టులు, ఏఆర్‌లో 3,601 పోస్టులు, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214 పోస్టులు, ఎన్‌సీబీలో 175 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. వీటిల్లో కానిస్టేబుల్‌(జీడీ)/రైఫిల్‌మ్యాన్‌(జీడీ) ఉద్యోగాలకు ఈ ఏడాది జనవరిలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ఆన్సర్ కీ ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఇక రాత పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ 8న విడుదలయ్యాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య/ప్రమాణ పరీక్షలు దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌ శిక్షణ కేంద్రాల్లో జరిగాయి. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించిన కమిషన్‌ ఈ రోజు తుది ఫలితాలు వెల్లడించింది.

ఎంపికైన పురుష అభ్యర్థుల వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఎంపికై మహిళా అభ్యర్థుల వివరాల కోసం క్లిక్‌ చేయండి.

రాష్ట్రాల వారీగా కటాఫ్‌ మార్కుల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.