SSC Exam Dates: సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల తేదీలు వెల్లడించిన స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌

విధ పరీక్షలకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) తాజాగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా ఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు ఎస్‌ఎస్‌సీ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో నిర్వహించనున్న రాత పరీక్ష తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక..

SSC Exam Dates: సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల తేదీలు వెల్లడించిన స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌
Staff Selection Commission
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 20, 2023 | 9:45 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 20: వివిధ పరీక్షలకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) తాజాగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా ఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు ఎస్‌ఎస్‌సీ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో నిర్వహించనున్న రాత పరీక్ష తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను కమిషన్‌ విడుదల చేసింది.

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ విడుదల చేసిన పరీక్షల తేదీలు ఇవే..

  • కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్‌ ఎగ్జామ్‌ 2023 (టైర్ 2) పరీక్ష అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో జరుగుతుంది
  • కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్‌ ఎగ్జామ్‌ 2023 (టైర్ 2) పరీక్ష నవంబర్‌ 2వ తేదీన జరుగుతుంది
  • జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌ 2023 (పేపర్‌ 2) పరీక్ష డిసెంబర్‌ 4వ తేదీన జరుగుతుంది
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ దిల్లీ పోలీస్‌ అండ్‌ సీఏపీఎఫ్‌ ఎగ్జామ్‌ 2023 పరీక్ష డిసెంబర్‌ 22వ తేదీన జరుగుతుంది

ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-3 ఎంపిక జాబితా విడుదల.. కౌన్సెలింగ్ తేదీలివే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలో రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత ఎంపిక జాబితా ఆగస్టు 19న విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉన్నాయి. ఈ నాలుగు క్యాంపస్‌లలో ఆగస్టు 23, 27 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. మూడో దఫా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సిందిగా ఆర్జీయూకేటీ సూచించింది.

ఎగ్జామ్ షెడ్యూల్‌ వివరాలకు సంబంధించిన ప్రకటన కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.