HPCL Recruitment 2023: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 276 ఉద్యోగాలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయోపరిమితి 25 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 18, 2023వ తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో యూఆర్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్..

HPCL Recruitment 2023: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 276 ఉద్యోగాలు..
HPCL Mumbai
Follow us

|

Updated on: Aug 21, 2023 | 1:33 PM

ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెపీసీఎల్‌).. 276 సీనియర్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, కెమికల్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్‌ మెయింటెనెన్స్, సీనియర్ ఆఫీసర్- ఎల్‌ఎన్‌జీ బిజినెస్‌, సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.

అలాగే వయోపరిమితి 25 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 18, 2023వ తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో యూఆర్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, (లా ఆఫీసర్లు/ లా ఆఫీసర్లకు మూట్ కోర్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.2,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

  • మెకానికల్ ఇంజినీర్ పోస్టులు: 57
  • ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు: 16
  • ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్ పోస్టులు: 36
  • సివిల్ ఇంజినీర్ పోస్టులు: 18
  • కెమికల్ ఇంజినీర్ పోస్టులు: 43
  • సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్‌ మెయింటెనెన్స్ పోస్టులు: 10
  • సీనియర్ ఆఫీసర్- ఎల్‌ఎన్‌జీ బిజినెస్‌ పోస్టులు: 02
  • సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్ పోస్టులు: 01
  • సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్ పోస్టులు: 01
  • సీనియర్ ఆఫీసర్- సేల్స్ (రిటైల్/ లూబ్స్/ డైరెక్ట్ సేల్స్/ ఎల్‌పీజీ) పోస్టులు: 05
  • సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్ ఫ్యూయల్ బిజినెస్ పోస్టులు: 30
  • సీనియర్ ఆఫీసర్- ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్‌ పోస్టులు: 04
  • ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ పోస్టులు: 02
  • ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్- విశాఖ రిఫైనరీ పోస్టులు: 02
  • క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) ఆఫీసర్‌ పోస్టులు: 06
  • చార్టర్డ్ అకౌంటెంట్స్ పోస్టులు: 24
  • లా ఆఫీసర్లు పోస్టులు: 09
  • లా ఆఫీసర్లు- హెచ్‌ఆర్‌ పోస్టులు: 05
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 04
  • జనరల్ మేనేజర్ (ఆఫీస్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీ) పోస్టులు: 01
  • వెల్ఫేర్‌ ఆఫీసర్‌- ముంబయి రిఫైనరీ పోస్టులు: 01

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.