BEL Recruitment 2023: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ కొలువులు.. నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో 34 డిప్యూటీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ ఇంజనీర్‌ మెకానికల్‌ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్ధులు తప్పనిసరిగా బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ లేదా ఏమ్‌ఐఈ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది..

BEL Recruitment 2023: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ కొలువులు.. నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం
BEL Ghaziabad
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 21, 2023 | 1:51 PM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో 34 డిప్యూటీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ ఇంజనీర్‌ మెకానికల్‌ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్ధులు తప్పనిసరిగా బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ లేదా ఏమ్‌ఐఈ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిప్యూటీ ఇంజనీర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్ధులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్హతలతోపాటు కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.

సెప్టెంబర్‌ 1, 2023వ తేదీ నాటికి దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 9, 2023వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.472 చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నియామక ప్రక్రియలో ఎంపికైతే నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.