Special FD : వృద్ధులకు బంపర్ ఆఫర్.. ఆల్ టైం హైకి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. గడువు పెంచిన బ్యాంకులు త్వరపడండి..
ఇదే క్రమంలో వృద్ధులను టార్గెట్ చేస్తూ పలు బ్యాంకులు అత్యధిక వడ్డీతో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్లను లాంచ్ చేశాయి. కనీస ఐదేళ్లు అంతకన్నా కాల వ్యవధితో ప్రారంభించే ఖాతాలపై సీనియర్ సిటిజెన్స్ కు ఈ ప్రత్యేక ఎఫ్ డీ స్కీమ్లలో అధిక వడ్డీలను అందిస్తున్నాయి. ఈ పథకాల గడువు ముగిసినా కూడా ఆయా బ్యాంకులు పలు దఫాలుగా వాటినిన పెంచుకుండూ వస్తున్నాయి.
సురక్షిత పెట్టుబడి పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ మొదటి స్థానంలో ఉంటుంది. అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్ ఇది. ముఖ్యంగా వృద్ధులు వీటిపై అధిక ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే బ్యాంకులు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై పలు ఆఫర్లను, అధిక వడ్డీలను ప్రకటిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో వృద్ధులను టార్గెట్ చేస్తూ పలు బ్యాంకులు అత్యధిక వడ్డీతో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్లను లాంచ్ చేశాయి. కనీస ఐదేళ్లు అంతకన్నా కాల వ్యవధితో ప్రారంభించే ఖాతాలపై సీనియర్ సిటిజెన్స్ కు ఈ ప్రత్యేక ఎఫ్ డీ స్కీమ్లలో అధిక వడ్డీలను అందిస్తున్నాయి. ఈ పథకాల గడువు ముగిసినా కూడా ఆయా బ్యాంకులు పలు దఫాలుగా వాటినిన పెంచుకుండూ వస్తున్నాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), హెచ్ ఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో స్పెషల్ ఎఫ్ డీ లు, వాటి వడ్డీ రేట్లు, సీనియర్ సిటిజెన్స్ కు ఒనగూరే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ ప్రకటించిన స్పెషల్ ఎఫ్ డీ ఎస్బీఐ వీకేర్. దీనిలో ఐదేళ్లు అంతకంటే ఎక్కువగా ఉండే ఎఫ్ డీపై ప్రస్తుతం ఉన్న సాధారణ బీపీఎస్ 50 కి అదనంగా మరో 50బీపీఎస్ ఎక్కువగా చెల్లిస్తుంది. ఈ పథకం గడువు 2023, సెప్టెంబర్ 30 వరకూ ఉంది. ఈ డిపాజిట్లపై బ్యాంక్ 7.5శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పథకం.. దీనిలో 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల కాలవ్యవధిలో సీనియర్ సిటిజన్‌లకు ప్రస్తుతం ఉన్న ప్రీమియం 50బీపీఎస్ కు అదనంగా మరో 25బీపీఎస్ చెల్లిస్తుంది. ఈ హెచ్‌డీఎఫ్‌సీ స్పెషల్ ఎఫ్డీ 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిపై వృద్ధులకు 7.75% వడ్డీ రేటును అందజేస్తుంది. ఈ ప్రత్యేక ఎఫ్ డీ పథకం 7 నవంబర్ 2023 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్ ఎఫ్‌డీ పథకం.. ఈ బ్యాంక్ కూడా 5 సంవత్సరాల1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు వృద్ధులకు ప్రస్తుత రేటు 50 బీపీఎస్ కంటే 10 బీపీఎస్ అదనంగా చెల్లిస్తుంది. ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.
ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ పథకం.. ఈ బ్యాంక్ కూడా పరిమిత కాలానికి మాత్రమే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించింది. ‘అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ ‘గా పిలువబడే ఈ పథకం 375 రోజుల వ్యవధితో ప్రారంభించబడింది. దీనిలో సీనియర్ సిటిజన్లకు 375 రోజులకుగానూ 7.60% వడ్డీ రేటు, 444 రోజులకు 7.65% వడ్డీ రేటును అందిస్తోంది.
గరిష్ట స్థాయికి ఎఫ్ డీ రేట్లు..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. ఆర్‌బీఐ వరుసగా మూడోసారి రేట్ పాజ్ చేసిన తర్వాత, బ్యాంకులు ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును ఇకపై పెంచబోవని స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..