Paytm New Feature: పేటీఎంలో మరో కొత్త ఫీచర్.. యూపీఐ పేమెంట్లు ఒక మరింత సులభం.. పూర్తి వివరాలు ఇవి..

పేటీఎం తీసుకొచ్చిన కొత్త ఫీచర్ పేరు పిన్ రీసెంట్ పేమెంట్స్. ఇది వినియోగదారుడు తరచుగా చేసే చెల్లింపులను త్వరితగతిన యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు పిన్ చేసిన కాంటాక్ట్ ఎప్పుడూ మీకు ఎగువన కనిపిస్తుంది. దాని కోసం వెతుక్కోవాల్సిన పని లేదు.

Paytm New Feature: పేటీఎంలో మరో కొత్త ఫీచర్.. యూపీఐ పేమెంట్లు ఒక మరింత సులభం.. పూర్తి వివరాలు ఇవి..
Paytm
Follow us

|

Updated on: Jun 30, 2023 | 3:30 PM

మన దేశంలోని ఆర్థిక వ్యవస్థ డిజిటల్ బాటలో శరవేగంగా ప్రయాణిస్తోంది. దేశంలో ఏ మూలన చూసిన యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) పేమెంట్స్ కనపడుతున్నాయి. మార్కెట్లో చాలా వరకూ క్యాష్ లావాదేవీలు ఆగిపోయాయి. అంతా డిజిటల్ బాట పడుతున్నాయి. ముఖ్యంగా కరోనా అనంతర పరిణామాల్లో క్యాష్ లెస్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ లావాదేవీలను బాగా ప్రోత్సహించింది. ఇది మొత్తం దేశ ఆర్థిక ఎదుగదలకు కారణమవుతోంది. అదెలా అంటారా? ఇది చదవండి..

పేటీఎం రాకతో మారిపోయిన స్వరూపం..

మన దేశంలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ముఖ్యంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం (ఎంఎస్ఎంఈ) కంపెనీలు ఈ ఎదుగుదలలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. దాదాపు 30శాతం దేశ జీడీపీ, 50శాతం ఎగుమతులు ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచే జరుగుతున్నాయి. ఈ ఎంఎస్ఎంఈ ఎదుగుల దేశీయ డిజిటల్ విప్లవానికి దారితీస్తున్నాయి. అయితే ఈ డిజిటల్ విప్లవంలో ప్రధాన భూమిక పోషిస్తోంది పేటీఎం. మన దేశానికి చెందిన మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ పేమెంట్స్, ఆర్థిక సేవలను అందించేందుకు ప్రత్యేక ప్లాట్ ఫాం ను సెట్ చేసింది. ఇది మార్కెట్లో లావాదేవీల రూపు రేఖలను మార్చేసింది. ప్రతి రూపాయి లెక్కలోకి వచ్చేలే చేస్తోంది. ఈక్రమంలో పేటీఎం మరో కొత్త ఫీచర్ ను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పిన్ రీసెంట్ పేమెంట్స్ ఫీచర్..

పేటీఎం తీసుకొచ్చిన కొత్త ఫీచర్ పేరు పిన్ రీసెంట్ పేమెంట్స్. ఇది వినియోగదారుడు తరచుగా చేసే చెల్లింపులను త్వరితగతిన యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు పిన్ చేసిన కాంటాక్ట్ ఎప్పుడూ మీకు ఎగువన కనిపిస్తుంది. దాని కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. దీని వల్ల పేమెంట్స్ వేగంగా, సురక్షితంగా జరిగిపోతాయి. ప్రస్తుతం ఐదు కాంటాక్ట్ లను మీరు సేవ్ చేసుకొనే వీలుంది. రానున్న కాలంలో పేటీఎం దీనిని మరింత ఎక్కువ కాంటాక్ట్ లను పిన్ చేసుకొనే వెసులుబాటును కల్పించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.

ఇవి కూడా చదవండి

మీరు ఈ ఫీచర్ ద్వారా త్వరితగతిన పేమెంట్లు చేయడానికి వీలవుతుంది. వినియోగదారులు ఈ ఫీచర్ ను పొందాలంటే మీరు యాప్ ను అప్ డేట్ చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది. యాపిల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి అప్ డేట్ చేసుకున్న తర్వాత పేటీఎం యాప్ ఓపెన్ చేసి యూపీఐ మనీ ట్రాన్స్ ఫర్ లోకి వెళ్లి మొబైల్ లోని కాంటాక్ట్ ను కాంటాక్ట్ ను సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత దానిపై లాంగ్ ప్రెస్ చేయండి. చివరిరిగా పిన్ క్లిక్ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..