Honda Activa: సరికొత్త వెర్షన్‌లో హోండా యాక్టివా వచ్చేసిందోచ్.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!

సరికొత్త వెర్షన్‌లో, స్టైలిష్ ఫీచర్లతో కొత్త మోడల్‌ హోండా యాక్టివా అందుబాటులోకి వచ్చేసింది. ఇటీవల హోండా కంపెనీ..

Honda Activa: సరికొత్త వెర్షన్‌లో హోండా యాక్టివా వచ్చేసిందోచ్.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Honda Activa 125
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 29, 2023 | 9:33 AM

సరికొత్త వెర్షన్‌లో, స్టైలిష్ ఫీచర్లతో కొత్త మోడల్‌ హోండా యాక్టివా అందుబాటులోకి వచ్చేసింది. ఇటీవల హోండా కంపెనీ యాక్టివా 125 హెచ్-స్మార్ట్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.88,093గా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. స్మార్ట్-కీ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చిన యాక్టివా 125 హెచ్-స్మార్ట్‌లో సరికొత్త ఫీచర్లు, అత్యాధునిక సెట్టింగ్స్‌ కస్టమర్లకు స్మార్ట్ అనుభవాన్ని అందిస్తాయి.

Activa 125 H-Smart ఫీచర్లు ఇలా..

  • స్మార్ట్ ఫైండ్:

హోండా యాక్టివా 125ని చాలా స్మార్ట్‌గా తయారు చేసింది హోండా కంపెనీ. మీరు యాక్టివాను ఎక్కడైనా పార్క్ చేయడం మర్చిపోతే దాన్ని గుర్తించడంలో H-స్మార్ట్ ఫీచర్ మీకు సహాయపడుతుంది. స్మార్ట్-కీ సాయంతో 10 మీటర్ల దూరంలో పార్క్ చేసిన స్కూటర్ ఎక్కడుందో ఈజీ కనిపెట్టొచ్చు. దీని కోసం, మీరు ఆన్సర్ బ్యాక్ బటన్‌ను నొక్కాలి. అంతే! Activa 125కి సంబంధించి నాలుగు సూచికలు బ్లింక్ అవుతాయి.

  • స్మార్ట్ సేఫ్:

యాక్టివా 125ను సురక్షితంగా ఉంచడంలో కూడా ఈ కొత్త టెక్నాలజీ సహాయపడుతుంది. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్‌తో, స్కూటర్ దొంగిలించబడకుండా చూసుకోవచ్చు. ఇమ్మొబిలైజర్ ఫంక్షన్ ఆన్ అయిన తర్వాత మీరు స్కూటర్ నుంచి 2 మీటర్ల దూరం వెళితే, స్మార్ట్ కీ స్కూటర్‌ని కంట్రోల్ చేస్తుంది.

  • స్మార్ట్ స్టార్ట్:

ఇప్పుడు మీరు స్కూటర్‌ను స్టార్ట్ చేయడానికి మీ జేబులో నుండి కీని తీయాల్సిన అవసరం లేదు. Activa 125కి 2 మీటర్ల దూరంలోకి వచ్చిన వెంటనే స్మార్ట్ కీ యాక్టివేట్ అవుతుంది. అనంతరం మీరు చేయాల్సిందల్లా నాబ్‌ని నొక్కడమే. దీని తర్వాత స్మార్ట్ కీ సూచిక, స్పీడోమీటర్‌ను ఆన్ చేస్తుంది. ఇగ్నిషన్ ఆన్ చేయడానికి నాబ్‌ను తిప్పండి. స్టార్ట్/స్టాప్ బటన్‌తో ఇంజిన్‌ను ప్రారంభించండి.

Activa 125 H-Smart స్పెసిఫికేషన్‌లు..

Activa 125 H-Smart అధికారికంగా ఇంకా మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేదు. మరికొద్ది రోజుల్లో రానుంది. ప్రస్తుతం దీని ధర వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి. కొత్త స్కూటర్‌లో 4 స్ట్రోక్ 124 సిసి ఎస్‌ఐ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఈ స్కూటర్ ఐదు రంగుల ఎంపికలలో లభిస్తుంది. హెవీ గ్రే మెటాలిక్, పెర్ల్ నైట్ స్టార్ బ్లాక్, సెలెన్ సిల్వర్ మెటాలిక్, మిడ్‌నైట్ బ్లూ మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్‌తో కూడిన పెరల్ ప్రెషియస్ వైట్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక 2023 హోండా యాక్టివా 125 వేరియంట్ల నిర్దిష్ట(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరలు ఇలా ఉన్నాయి..

  • 2023 హోండా యాక్టివా 125 డ్రమ్: రూ. 78,920
  • 2023 హోండా యాక్టివా 125 డ్రమ్ అల్లాయ్: రూ. 82,588
  • 2023 హోండా యాక్టివా 125 డిస్క్: రూ. 86,093
  • 2023 హోండా యాక్టివా 125 హెచ్-స్మార్ట్: రూ. 88,093