Car Insurance: కారు, బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ 3 విషయాలను తప్పక పరిశీలించాలి..
అది కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే, దీనికంటే ముందుగా మీరు 3 విషయాలను తప్పక పరిశీలించాల్సి ఉంది. వాటిని గమనించడం వల్ల మీరు తీసుకునే ఇన్స్యూరెన్స్‌తో ప్రయోజనం ఉంటుంది. లేదంటే.. తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అది కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే, దీనికంటే ముందుగా మీరు 3 విషయాలను తప్పక పరిశీలించాల్సి ఉంది. వాటిని గమనించడం వల్ల మీరు తీసుకునే ఇన్సూరెన్స్‌తో ప్రయోజనం ఉంటుంది. లేదంటే.. తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఆ మూడు అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
IDV విలువను గమనించాలి..
IDV విలువ అంటే.. సాధారణ భాషలో మీ కారు దొంగిలించబడినా, ప్రమాదంలో పాడైపోయినా కంపెనీ మీకు ఇచ్చే విలువ. బీమాను కొనుగోలు చేసేటప్పుడు ఏ కంపెనీ మీకు ఎక్కువ IDV విలువను అందజేస్తుందో చెక్ చేసుకోవాలి. అయినప్పటికీ మీరు ఎక్కువ IDV వాల్యూని తీసుకుంటే ప్రీమియం ఎక్కువగా ఉండవచ్చు.
బీమా ప్రీమియాన్ని చెక్ చేసుకోవాలి..
బీమాను కొనుగోలు చేయడానికి కంపెనీకి చెల్లించే డబ్బును ప్రీమియం అంటారు. బీమాను కొనుగోలు చేసే ముందు ఏ కంపెనీ ఉత్తమ ప్రీమియం అందజేస్తుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. మార్కెట్‌లో అనేక చౌక ప్రీమియం ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాన్‌లతో బీమా ప్రయోజనాలు కొన్ని తగ్గుతాయి. అలాంటి పరిస్థితుల్లో మీ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. మంచి ప్లాన్, ప్రిమియంను ఎంచుకోవాలి.
CSR చెక్ చేయాలి..
ఇన్స్యూరెన్స్ తీసుకునే వారు మొదటగా సీఎస్ఆర్‌ని చెక్ చేసుకోవాలి. సీఎస్ఆర్ అంటే.. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అంటారు. అంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న కంపెనీలో సెటిల్‌మెంట్ రేషియో ఎంత శాతం ఉందో చెబుతుంది. సీఎస్ఆర్ ఎక్కువగా ఉన్న కంపెనీ ప్లాన్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..