G Sampath Kumar

G Sampath Kumar

Staff Reporter - TV9 Telugu

sampath.gandla@tv9.com
Telangana: ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను తయారు చేసిన యువ ఇంజినీర్.. తక్కువ ఖర్చు.. ఎక్కువ సాగు..

Telangana: ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను తయారు చేసిన యువ ఇంజినీర్.. తక్కువ ఖర్చు.. ఎక్కువ సాగు..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన మూల శశిరథ్ రెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈయన తండ్రి వ్యవసాయం చేస్తున్నారు. పూర్తిగా ట్రాక్టర్ ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే డీజిల్ ఎక్కువ వాడటంతో పెట్టుబడి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఒక ఎకరాకు దున్నాలంటే.. ట్రాక్టర్‎కు రెండు వేల వరకు చెల్లించాలి. అలా రెండు, మూడు సార్లు దున్నాలి. దీంతో ట్రాక్టర్‎కే .. ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది.

Telangana: ఆ ఊరిలో చీకటి పడిందంటే.. భయం భయం! శ్రావణమాసంలో ఎటుచూసినా అవే..

Telangana: ఆ ఊరిలో చీకటి పడిందంటే.. భయం భయం! శ్రావణమాసంలో ఎటుచూసినా అవే..

రాత్రి అయ్యిందంటే.. భయం భయం, బయటకు రావాలంటేనే జంకుతున్న జనం. ఎటు చుసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు..చిమ్మ చీకటిలో పూజలు.. ఇక్కడ రాత్రి 8 గంటలు దాటుతే చాలు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆదివారం, అమావాస్య, ఇతర రోజుల్లో పూజలు

అ ఊరిలో కోరిన కోర్కెలు తీరితే ఏకంగా గుళ్ళు కట్టేస్తారు.. ఊరినిండా ఆలయాలే!

అ ఊరిలో కోరిన కోర్కెలు తీరితే ఏకంగా గుళ్ళు కట్టేస్తారు.. ఊరినిండా ఆలయాలే!

ఇదొక ఆధ్యాత్మిక గ్రామం. ఇక్కడ కోరిన కోర్కెలు తీరుతే ఆలయాలు నిర్మిస్తారు. దీంతో ఆ గ్రామం నిండా ఆలయాలే. ఈ గ్రామంలో 120 కి పైగా ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా కోరిన కోరికలు తీరాలని దేవుడిని ప్రార్థించటం సహజం. కోరిన కోరిక లు తీరుతే కొబ్బరికాయ కొట్టాడామో లేదంటే తలనీలాలు సమర్పించడం, ఇరత మొక్కుబడులు లేదా ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటాం. ఐతే ఈ గ్రామంలో మాత్రం కోరిన కోర్కెలు తీరుతే ఏకంగా ఆలయాలను నిర్మిస్తున్నారు. ఈ ఆలయాల గ్రామం గురించి తెలుసుకుందాం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 5000 మంది జనాభా ఉంటుంది. ఈ గ్రామంలో..

Temple For Wife: ఆదర్శ భర్త.. భార్యకు గుడి కట్టించి నిత్య పూజలు.. ఎక్కడో తెలుసా ?

Temple For Wife: ఆదర్శ భర్త.. భార్యకు గుడి కట్టించి నిత్య పూజలు.. ఎక్కడో తెలుసా ?

అర్ధాంగి కాలం చేసి ఏడు సంవత్సరాలు అవుతోంది. ఆమె కోసం తన భర్త గుడి నిర్మించడం ఇప్పుడు స్థానికంగా చర్చానియాంశమైంది. ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భార్యకు నిత్య పూజలు చేస్తున్నారు ఆ భర్త. అలాగే తన సతీమణి వర్ధంతి సందర్భంగా అన్నదానం చేసి పేదల కడుపు నింపుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో జొంగోని ముత్తయ్య అనే వృద్ధుడు ఉంటున్నాడు.

Telangana Elections: ఆ వివాదమే రమేష్ బాబు కొంప ముంచిందా.. టికెట్ రాకపోవడానికి కారణం..

Telangana Elections: ఆ వివాదమే రమేష్ బాబు కొంప ముంచిందా.. టికెట్ రాకపోవడానికి కారణం..

Chennamaneni Ramesh Babu: నేడో రేపో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు ఆశాభంగం వెనక అసలు కారణం ఆయన పౌరసత్వ వివాదమేనని స్ఫష్టం అయింది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రమేష్ బాబు బలమైన వ్యక్తే కానీ ఆయన పౌరసత్వ వివాదంపై తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు.

Telangana: ఈ బామ్మకు వింత అలవాటు..13 ఏళ్లుగా అన్నం ముట్టదు.. సుద్ద ముక్కలు మాత్రమే ఆహారం..

Telangana: ఈ బామ్మకు వింత అలవాటు..13 ఏళ్లుగా అన్నం ముట్టదు.. సుద్ద ముక్కలు మాత్రమే ఆహారం..

మల్లవ్వకు సరిగా మాటలు రావు, ఇంటి వద్దనే ఉంటుంది.. గతంలో... ఈమెను వివిధ అసుపత్రులకు తీసుకెళ్లారు. అయినప్పటికీ.. అన్నం మాత్రం తినడం లేదు. అన్నం తింటే.. వాంతులు అవుతాయనే  అనుమానంతో.. ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఇక.. కుటుంబ సభ్యులు కూడా.. చెప్పడం మానేశారు.. ఆమె కోసం.. సుద్ద ముక్కలు మాత్రం తీసుకొస్తారు. వాటిని, చిన్న, చిన్నగా కట్ చేసి. సుద్ద ముక్కలు తింటుంది.

Cyber Crimes: నిరుద్యోగ యువతే వారి లక్ష్యం.. ఉద్యోగాల పేరిట కోట్ల రూపాయలు హాంఫట్! పోలీసుల చెరలో కేటుగాళ్లు

Cyber Crimes: నిరుద్యోగ యువతే వారి లక్ష్యం.. ఉద్యోగాల పేరిట కోట్ల రూపాయలు హాంఫట్! పోలీసుల చెరలో కేటుగాళ్లు

వేములవాడ పట్టణంలోని తిప్పాపురానికి చెందిన అజ్మీర గణేష్ అనే వ్యక్తి భార్య సునీతకి జీమెయిల్‌ వచ్చింది. ఆయుష్మాన్ భారత్‌లో PRO పోస్ట్ ఉందని మెయిల్ చేసి వివరాల కోసం 9515559446 నెంబర్ ని సంప్రదించాలని సదరు జీమెయిల్‌ తెలిపాడు. అది నమ్మిన సునీత ఆ నెంబర్‌కి కాల్ చేసి నిందితుడితో మాట్లాడగా ఉద్యోగం కావాలంటే రూ.2,85,000 ఫోన్ పే చేయాలని కోరారు. వెంటనే సునీత ఆ మొత్తం నగదు ఫోన్‌ పే చేసింది. తర్వాత నిందుతుడు పత్తాలేకుండా పోవడంతో మోసపోయానని గ్రహించిన సునీత ఈ ఏడాది..

Telangana: ఈ బౌద్ధ స్థూపం కింద బంగారు లంకె బిందెలు ఉన్నాయా? వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు..!

Telangana: ఈ బౌద్ధ స్థూపం కింద బంగారు లంకె బిందెలు ఉన్నాయా? వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు..!

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టకు.. వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో ప్రాచీనమైన ప్రాంతం. గతంలో దూళికట్టను. దవలికోట అని పిలిచేవారు. కాలక్రమేణా దూళికట్టగా మారిపోయింది. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటి బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది. ఇక్కడ బుద్ధుడు బోధి వృక్షం కింద కొన్ని రోజుల పాటు ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. ఈ బౌద్ధ స్థూపం పక్కనే వాగులు, వంకలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని శాతవాహునులు పాలించారు. ఈ కోట కింద ఓ నగరం కూడా ఉందని చరిత్ర చెబుతుంది.

BRS Candidates: ఈ ముగ్గురికి టికెట్ ఇవ్వద్దు.. పెద్దపల్లి బీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయతీ..

BRS Candidates: ఈ ముగ్గురికి టికెట్ ఇవ్వద్దు.. పెద్దపల్లి బీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయతీ..

ఎమ్మెల్యే అభ్యర్థులను అనౌన్స్ సిద్దమవుతుంటే.. మరోవైపు ఆ ఎమ్మెల్యేలు మాకు వద్దు అంటూ పార్టీ శ్రేణులు అసమ్మతి గళాలు వినిపిస్తున్నారు. పార్టీ శ్రేణులకు.. ఎమ్మెల్యేలకు మద్య గ్యాప్ పెరగడమే అంతర్గత విభేధాలకు కారణం కాగా.. అధిష్టానం బుజ్జగిస్తున్నా అసమ్మతి నేతలు సమ్మతించడం లేదు. పార్టీ బలంగా ఉన్నా.. అసమ్మతి నేతల తీరుతో ఎమ్మెల్యే అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ ముదురుతున్న ఇంటర్నల్ వార్ ఎటువైపు..

Telangana: మాటలకందని విషాదం.. కోతిని కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయిన రైతు..

Telangana: మాటలకందని విషాదం.. కోతిని కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయిన రైతు..

ట్రాన్స్‌ఫార్మర్‌లో చిక్కుకుని విలవిల్లాడుతున్న కోతిని కాపాడే ప్రయత్నంలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు మృతితో ఆయన కుటుంబం సహా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో తిరుగుతున్న కోతి.. ఆహారం కోసం వెతుకుతూ ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కింది. ఆ సమయంలో పొరపాటు జారి ట్రాన్స్‌ఫార్మర్ మధ్యలో ఇరుక్కుపోయింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.

Karimnagar: ఆగని గుండెపోటు మరణాలు.. తమ్ముడి చిన్న కర్మ రోజు అన్నకు హార్ట్‌ఎటాక్‌.. 12 రోజుల వ్యవధిలో అన్నాదమ్ములు మృతి

Karimnagar: ఆగని గుండెపోటు మరణాలు.. తమ్ముడి చిన్న కర్మ రోజు అన్నకు హార్ట్‌ఎటాక్‌.. 12 రోజుల వ్యవధిలో అన్నాదమ్ములు మృతి

Karimnagar: తమ్ముడు మధుసూధన్ హఠణ్మారంతో ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ తమ్ముని చిన్నకర్మ రోజున గుండెపోటుకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో షాకుకు గురైన చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పది రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన శ్రీకాంత్ రెడ్డి కూడా కన్నుమూశాడు.

Telangana: పెద్దపల్లిలో గ్యాంగ్ రేప్.. బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రవం.. చికిత్స పొందుతు మృతి

Telangana: పెద్దపల్లిలో గ్యాంగ్ రేప్.. బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రవం.. చికిత్స పొందుతు మృతి

పొట్ట కూటి కోసం మధ్యప్రదేష్ నుండి వలస వచ్చిన కుటుంబానికి చెందిన బాలికపై పైశాచికత్వానికి ఒడిగట్టారు. అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని మధ్యప్రదేష్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. అప్పన్నపేటకు భవననిర్మాణ కార్మికులుగా ఉపాధి పొందేందుకు మధ్యప్రదేష్ నుండి కూలీల కుటుంబాలు వలస వచ్చాయి.