Telangana: ఆ ఊరిలో చీకటి పడిందంటే.. భయం భయం! శ్రావణమాసంలో ఎటుచూసినా అవే..

రాత్రి అయ్యిందంటే.. భయం భయం, బయటకు రావాలంటేనే జంకుతున్న జనం. ఎటు చుసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు..చిమ్మ చీకటిలో పూజలు.. ఇక్కడ రాత్రి 8 గంటలు దాటుతే చాలు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆదివారం, అమావాస్య, ఇతర రోజుల్లో పూజలు

Telangana: ఆ ఊరిలో చీకటి పడిందంటే.. భయం భయం! శ్రావణమాసంలో ఎటుచూసినా అవే..
Occult Worship In Sultanaba
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Aug 24, 2023 | 12:43 PM

పెద్దపల్లి, ఆగస్టు 24: రాత్రి అయ్యిందంటే.. భయం భయం, బయటకు రావాలంటేనే జంకుతున్న జనం. ఎటు చుసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు..చిమ్మ చీకటిలో పూజలు.. ఇక్కడ రాత్రి 8 గంటలు దాటుతే చాలు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆదివారం, అమావాస్య, ఇతర రోజుల్లో పూజలు చేస్తున్నారు.. పట్టణ శివారులో భయంకరమైన దృశ్యాలు కనబడుతున్నాయి.. చిమ్మ చికట్లో నకిలీ బాబు దర్శనమిస్తున్నారు.. వీరిని చూసి స్థానికులు భయం తో పరుగులు తీస్తున్నారు.. ఇలా ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి తెలుసుకుందాం..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్ర పూజలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. చీకటి పడితే చాలు మంత్రగాళ్లు ఊరి పొలిమేరలో తిష్ట వేసి కూర్చుంటున్నారు. మూడు, నాలుగు రోడ్ల కూడలి వద్ద క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. శ్రావణమాసంలో సాయంత్రం అయితే చాలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనం. సుల్తానాబాద్ లోని నీరుకుల్ల రోడ్డులో ఎస్సారెస్పీ కెనాల్ వంతెన పై పెద్ద ఎత్తున, భయంకరంగా క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రయితే చాలు మంత్రగాళ్లు క్షుద్రపూజలు చేస్తున్నారు. ఆది, గురువారాల్లో గ్రామ పొలిమేరలో పంట పొలాల వద్ద విస్తరాకులో అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి, కోడిగుడ్డు, నిమ్మకాయలు పెట్టి, బొమ్మలకు మేకులు గుచ్చి, నల్ల కోడిని బలిచ్చి, జీడిగింజలు, మిరపకాయలు మద్యం సీసా ఆ పక్కన పెట్టి క్షుద్ర పూజలు చేస్తున్నారు.

దీంతో పొలాల వద్దకు వెళ్లాలంటేనే రైతులు, రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు, శ్రావణమాసంలో ఇలాంటి క్షుద్ర పూజలు చేయడంతో జనం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అంతరిక్షంలోకి దూసుకెళుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా దొంగబాబాల బారిన పడి జనం మోసపోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు గానీ, పోలీసులు గానీ మూఢనమ్మకాల బారిన పడి మోసపోతున్న వారికి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. అంతే కాదు.. ఈ రోడ్ వెంట పిల్లలను పంపించాలంటే భయపడుతున్నారు. ఇక్కడ ఊడల మర్రి దృశ్యాలు కనబడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.