అదివో అల్లదివో.. అంటూ తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ కొండెక్కుతున్న భక్తులకు ఇప్పుడు నడక మార్గంలో పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆపదమొక్కుల స్వామి శ్రీ వెంకటేశ్వరుడి మొక్కులు తీర్చుకునేందుకు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో కొండెక్కే భక్తులు భద్రతపరంగా టిటిడి తీసుకున్న నిర్ణయాలను ఇకపై తూచా తప్పక పాటించాల్సి ఉంది. చిరుతల వరుస దాడులు, క్రూర మృగాల సంచారంతో అప్రమత్తమైన టిటిడి భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అటివిశాఖ వైల్డ్ లైఫ్ అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియా పాండే నేతృత్వంలోని ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు..