Andhra Pradesh: ఆ ఎమ్మెల్యే స్టైలే వేరు.. వీరతాడుతో మాస్ స్టెప్పులేసిన నాయకుడు.. మురిసిపోయిన జనాలు..

ఈయన కాస్త డిఫరెంట్. అవును, తిరుపతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీరతాడుతో స్టెప్పులు వేశారు. మామూలుగానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. జనంలో ఎప్పుడూ సందడి చేసే నైజమున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్.. తానెప్పుడూ ప్రత్యేకమని చాటే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తిలోనైనా.. అసెంబ్లీ లోనైనా.. ఆకట్టుకునే స్టైల్ ఆ ఎమ్మెల్యేది. తన ఆహబావాలతో, మాటలతో జోకులేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. గ్రామాల్లో గడపగడప కార్యక్రమాల్లో..

Andhra Pradesh: ఆ ఎమ్మెల్యే స్టైలే వేరు.. వీరతాడుతో మాస్ స్టెప్పులేసిన నాయకుడు.. మురిసిపోయిన జనాలు..
MLA Biyyapu Madhusudhan Reddy Dance
Follow us
Raju M P R

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:49 PM

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనంలో మమేకమయ్యేందుకు లీడర్లు అన్ని ఎత్తులు వేస్తున్నారు. జనంతో కలిసి సందడి చేసి మీలో ఒకరిమని కలిసి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే కూడా అంతే. అయితే, ఈయన కాస్త డిఫరెంట్. అవును, తిరుపతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీరతాడుతో స్టెప్పులు వేశారు. మామూలుగానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. జనంలో ఎప్పుడూ సందడి చేసే నైజమున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్.. తానెప్పుడూ ప్రత్యేకమని చాటే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తిలోనైనా.. అసెంబ్లీ లోనైనా.. ఆకట్టుకునే స్టైల్ ఆ ఎమ్మెల్యేది. తన ఆహబావాలతో, మాటలతో జోకులేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. గ్రామాల్లో గడపగడప కార్యక్రమాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు.

ఇందులో భాగంగానే రేణిగుంట మండలం అత్తూరులో యాదవులతో కలిసి స్టెప్పులు వేశారు. గ్రామంలో జరుగుతున్న జాతరకు గంగమ్మకు ఊరేగింపుగా సారెతో వెళుతున్న యాదవులతో కలిసిపోయిన ఎమ్మెల్యే.. వారు నిర్వహించే సంబరంలో మునిగిపోయారు. గంగ పెట్టెతో గంగమ్మకు సారె తీసుకుని, వీరతాడు నృత్యం చేసిన యాదవులతో కలిసి నృత్యం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అత్తూరుకి వెళ్ళిన ఎమ్మెల్యే బియ్యపు మధు.. ఆ యాదవులతో కలిసి వీరతాడు తీసుకొని అదరగొట్టే స్టెప్పులు వేశారు. గ్రామస్తులతో కలిసి సందడి చేశారు.

రెండు రోజుల క్రితం రేణిగుంట మండలం దేశమ్మ నగర్ లోనూ మహిళలతో కలిసి కోలాటం వేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన తనకు స్వాగతం పలుకుతూ మహిళలు కోలాటం వేయడాన్ని చూసిన ఎమ్మెల్యే మధు.. మహిళలతో కలిసి కోలాటంలో మునిగిపోయారు. మహిళలతో కలిసి స్టెప్పులేసి కోలాటంతో సందడి చేశారు. ఎన్నికల ఏడాదిలో జనంలో ఉండేందుకు ఇలా ఫీట్లు చేస్తున్న ఎమ్మెల్యేలు ఏ అవకాశాన్ని వదులుకోలేక పోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..