Naresh Gollana

Naresh Gollana

Correspondent - TV9 Telugu

gollana.naresh@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్‌న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్‌న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Telangana: అయ్యో పాపం.. పురిటి నొప్పులతో నట్టడివిలో నడిరోడ్డుపై గిరిజన మహిళ ప్రసవం

Telangana: అయ్యో పాపం.. పురిటి నొప్పులతో నట్టడివిలో నడిరోడ్డుపై గిరిజన మహిళ ప్రసవం

Nirmal News: ప్రపంచం విప్లవాత్మకంగా దూసుకుపోతుంటే.. చందమామపై అడుగు పెట్టి దేశం మురిసిపోతుంటే అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ మాత్రం ఇంకా అవే కష్టాలతో.. తీరని కన్నీళ్లతో సాగిపోతోంది. విశ్వానికి నిచ్చనలేస్తున్న ఈ కాలంలో ఈ జిల్లాలో మాత్రం ఇంకా వైద్యం కోసం వాగులు దాటక తప్పడం లేదు. ఆస్పత్రి చేరే దారి లేక అంబులెన్స్ వచ్చే మార్గం కనిపించక పురిటి నొప్పులతో ఆదివాసీ అడవి తల్లులకు ఇప్పటికింకా అరిగోస పడక తప్పడం లేదు.

Telangana: అయ్యో‌తల్లీ ఎంత కష్టమొచ్చే.. శ్మశానంలో‌ నిండు గర్బిణీ నివాసం! చెత్తాచెదారమే ఆహారం..

Telangana: అయ్యో‌తల్లీ ఎంత కష్టమొచ్చే.. శ్మశానంలో‌ నిండు గర్బిణీ నివాసం! చెత్తాచెదారమే ఆహారం..

ఆమె మానసిక‌ వికలాంగురాలు.. అందులోను నిండు గర్బిణీ. ఇంటి నుండి తప్పిపోయి.. దారి తెలియక, ఊరు తెలియక నట్టడివిలో ప్రయాణం సాగించింది. 60 కిలో మీటర్లు ప్రయాణించి ఉట్నూర్ కు చేరుకుంది. ఉండేందుకు చోటు కనిపించక ఎక్కడ నివాసం ఉండాలో తెలియక ఆ బోలాశంకరుడు నివాసం ఉండే స్మశానాన్నే ఎంచుకుంది. పక్కనే డంపింగ్ యార్డ్ లోని చెత్తా చెదారాన్ని తింటూ మూడు రోజులుగా జీవనం సాగించింది. స్థానిక పారిశుధ్య కార్మికుల కంట పడటంతో ఆరా తీస్తే చిరు నవ్వుతోనే సమాధానం ఇచ్చింది. మానసిక వికలాంగురాలు కావడంతో ఊరు..

Telangana: మూడు ముళ్లతో ఏకమైన ఆస్ట్రేలియా అమ్మాయ్‌.. నిర్మల్ అబ్బాయ్‌! అతను సాఫ్ట్‌వేర్, ఆమె సైంటిస్ట్..

Telangana: మూడు ముళ్లతో ఏకమైన ఆస్ట్రేలియా అమ్మాయ్‌.. నిర్మల్ అబ్బాయ్‌! అతను సాఫ్ట్‌వేర్, ఆమె సైంటిస్ట్..

భారతదేశం అంటే ఇష్టపడని వాళ్లు దాదాపు ఉండరు. ప్రపంచ దేశాల్లో భారత్ అన్న.. భారత దేశ సంస్క్రతి ఆచార వగయవహారాలన్న.. మన పల్లెటూర్లన్న తెగ ఇష్టపడుతారు విదేశీయులు. భారత దేశంలో గడపాలని కొందరు కోరుకుంటే ఇక్కడికి కోడలుగా రావాలని మరికొందరు సంబరపడుతారు‌. అలాంటి ఓ ఆస్ట్రేలియా అమ్మాయి కథే ఇది‌. తెలంగాణలోని నిర్మల్‌కు చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లాడి తెలుగింటి కోడలుగా అడుగు పెట్టింది ఓ ఆస్ట్రేలియా అమ్మాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రి నగర్ కాలనీకి చెందిన సదానందం పద్మ దంపతుల కుమారుడు కార్తీక్ చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడ హనా అనే..

Telangana:  పనికెళితే ఆదివాసీ బాలికపై అఘాయిత్యం.. సీన్ కట్ చేస్తే.. శీలానికి వెల కట్టిన దుర్మార్గులు..

Telangana: పనికెళితే ఆదివాసీ బాలికపై అఘాయిత్యం.. సీన్ కట్ చేస్తే.. శీలానికి వెల కట్టిన దుర్మార్గులు..

సింగరేణి ఖిల్లాలోని ఓ ఆదివాసీ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తల్లితండ్రి లేని ఓ15 ఏళ్ల ఆదివాసీ బాలిక శీలానికి అక్కడి పెద్దలు ఖరీదు కట్టారు. ఓ దుర్మార్గుడి అఘాయిత్యానికి ఓ బాలిక గర్భం దాల్చగా పెద్దలు మరో దారుణానికి ఒడిగట్టారు.. ఆ గర్బాన్ని గుట్టు చప్పుడు కాకుండా తొలగించి.. ఆ అమాయక గిరిజన బాలిక శీలానికి వెలకట్టారు. ఆ చిన్నారి తల్లి గర్భం ఖరీదు..

Telangana: 18 కాదు.. ఇక నుంచి 21.. మళ్లీ మారనున్న ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం.. సర్కార్ తాజా ఉత్తర్వులు..

Telangana: 18 కాదు.. ఇక నుంచి 21.. మళ్లీ మారనున్న ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం.. సర్కార్ తాజా ఉత్తర్వులు..

జిల్లాల విభజనతో కేవలం 13 మండలాలకు పరిమితం అయింది. ఆ తర్వాత పాలన సౌలభ్యం భీంపూర్, సిరికొండ, గాదిగూడ, మావల, ఆదిలాబాద్ అర్బన్ లను కొత్త మండాలలుగా ఏర్పాటు చేయడంతో మండలాల సంఖ్య 18 కి చేరింది. అయినా జైనథ్ , బేల మండలాల విస్తీర్ణం అత్యదికంగా ఉండటం.. జైనథ్ 55 గ్రామాలతో అతి పెద్ద మండలంగా కొనసాగుతుండటంతో ఈ మండలాన్ని విభజించాలని డిసైడ్ అయింది సర్కార్. భోరజ్ కేంద్రంగా మండల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. మరో వైపు మహారాష్ట్ర సరిహద్దు వరకు...

Mancherial: విడాకులు ఇవ్వలేదని భార్య పాలిట కాలయముడైన భర్త.. 10 లక్షల సుపారీ ఇచ్చి మరీ..

Mancherial: విడాకులు ఇవ్వలేదని భార్య పాలిట కాలయముడైన భర్త.. 10 లక్షల సుపారీ ఇచ్చి మరీ..

Mancherial: భార్య విడాకులు ఇస్తేనే మరో యువతిని చేసుకునే పరిస్థితి ఉండటంతో ఇక లాభం లేదనుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భార్యను మట్టుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు భర్త. చేతికి రక్తం అంటకుండా 10 లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్ వాడకు చెందిన బత్తిని శరణ్య, రాళ్లపేట కు చెందిన సయ్యద్ జియా ఉల్ హక్ 2009 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సయ్యద్ జియా ఉల్ హక్ అలియాస్ సద్దు.. సిఐఎస్ఎఫ్..

Telangana: కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గపోరు.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఆ జిల్లా హస్తం నేతలు

Telangana: కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గపోరు.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఆ జిల్లా హస్తం నేతలు

తీవ్ర ఆగ్రహానికి గురైన వీహెచ్ ఒకనొక దశలో‌ సభను బైకాట్ చేసి బయటకు వెళ్లగా బీసీ నేతల విజ్ఞప్తితో తిరిగి కార్యక్రమాన్ని కొనసాగించారు. బీసీ ఐక్య వేదికను‌అడ్డుకుని బీసీల అగౌరవపరిచారని.. వీహెచ్ పైకి దాడికి యత్నించాడని డీసీసీ అద్యక్షుడు సాజుద్ ఖాన్ కంది శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బీసీ ఐక్య వేదిక సభ రసాభాసగా మారింది. జిల్లా కాంగ్రెస్ నేతలు సాజిద్ ఖాన్, కంది శ్రీనివాస్ రెడ్డి వర్గాలు ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత...

Telangana: ఆ ఊరి హనుమాన్ ఆలయంలో వింత ఘటన.. కంటి చూపుకోల్పోయిన గ్రామస్థులు!

Telangana: ఆ ఊరి హనుమాన్ ఆలయంలో వింత ఘటన.. కంటి చూపుకోల్పోయిన గ్రామస్థులు!

దేవుడికి అపచారం జరిగిందని.. ఇప్పటికే గ్రామంలో ఇద్దరి కళ్లు పోయాయని.. మరింత ఘోరం జరగక ముందే నివారణ పూజలు చేయాలని‌ పెద్దలు నిర్ణయించడంతో.. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు డోంగ్రేగావ్ గ్రామస్తులు సిద్ధమయ్యారు. అదే సమయంలో హనుమాన్ దేవాలయాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో హఠాత్తుగా అక్కడ పాము ప్రత్యక్షమైంది. వెంటనే అక్కడి యువత ఆ పామును ఏమి అనకుండా పక్కకు తప్పుకున్నారు. తమపై కరుణ చూపేందుకే నాగోబా రూపంలో ఈ పాముకు ఇక్కడికి వచ్చిందని..

Telangana: చోరీలందు ఈ చోరీలు వేరయా.. మాయ మాటలతో బురిడి కొట్టిస్తున్న కేటుగాళ్లు

Telangana: చోరీలందు ఈ చోరీలు వేరయా.. మాయ మాటలతో బురిడి కొట్టిస్తున్న కేటుగాళ్లు

నిర్మల్ జిల్లా ముదోల్ నియోజక వర్గ పరిదిలో వరుసగా మూడు చోట్ల బంగారు దొంగ తనాలు జరిగాయి. కానీ ఈ చోరీలు చైన్ స్నాచింగ్ చోరీలు మాత్రం కాదు. అంతకు మించి.. పక్క ప్రణాళిక ప్రకారం చేస్తున్న చోరీలే ఇవి. మహిళ లు , వృద్దులే లక్ష్యం గా ఈ చోరీలు‌ సాగుతున్నాయి. ఈ నెల ఆగస్టు 4 న బాసర మండల కేంద్రంలో, ఆగస్టు 10 న కుభీర్ మండల కేంద్రంలో ఆగస్టు 12 న కుంటాల మండలం కల్లూరు లో మూడు చోట్ల ఒకే తరహా చోరీలు. వరుస చోరీలకు పాల్పడిన దుండగులు‌ ఎంచుకున్న రూట్ వేరైనా చోరీ చేసిన విధానం మాత్రం సేమ్ టూ..

Basara IIIT: సెలవులే శరణ్యం..! ట్రిపుల్ ఐటీ కొత్త బ్యాచ్‌కు హోమ్ సిక్ హాలీడేస్.. ఎందుకంటే..?

Basara IIIT: సెలవులే శరణ్యం..! ట్రిపుల్ ఐటీ కొత్త బ్యాచ్‌కు హోమ్ సిక్ హాలీడేస్.. ఎందుకంటే..?

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కి వచ్చి వారం రోజులు కాకుండానే తమకు సెలవులెందుకు ఇచ్చారో తెలియక అయోమయానికి గురవుతున్నారు విద్యార్థులు. ఏదేమైనా ఇంటికి వెళ్లాలంటూ ఉన్నతాధికారులే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొంచెం ఇష్టంగా ఇంకొంచం కష్టంగా ఇంటి దారి పట్టారు విద్యార్థులు. అయితే అలా వెళుతున్న విద్యార్థులంతా వారంలోగా రిఫ్రెష్ అయి కాలేజీలో క్యాంపస్ లైఫ్‌ను జాలీగా ఎంజాయ్ చేస్తూ.. ఉన్నత చదువులపై ఫోకస్ పెట్టేలా సిద్దం అయి వచ్చేందుకే ఈ హాలీడేస్ అంటోంది అక్కడి‌ అధికార..

Telangana: కమీషన్ల కోసం కక్కుర్తి పడటం ఆపండి..  బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Telangana: కమీషన్ల కోసం కక్కుర్తి పడటం ఆపండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

దళిత బంధు పథకంలో రెండు నుంచి మూడు లక్షల చొప్పున గుడ్ విల్ తీసుకుంటున్నారని.. తాజాగా బీసీ, మైనారిటీ చెక్కులలోను రూ.10 నుంచి 20వేలు కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని నా దృష్టికి వచ్చిందని‌ అన్నారు. ఇలాంటి పద్దతిని మార్చుకోవాలని సదరు నేతలకు , అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్ననే బీసీ చెక్కుల పంపిణీలో బహిరంగంగా ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. బీసీ కుల వృత్తులకు చెక్కుల పంపిణీలో భాగంగా గురువారం జెడ్పి సమావేశ మందిరంలో ఈ వ్యాఖ్యలు చేశారు జోగు రామన్న.

Tomatoes: టమాటాలకు తగ్గిన డిమాండ్.. అయినా తప్పని పోలీసుల భద్రత

Tomatoes: టమాటాలకు తగ్గిన డిమాండ్.. అయినా తప్పని పోలీసుల భద్రత

టమాటా రేటు తగ్గినా ఇంకా నేనే రారాజునంటోంది. నేల పాలైతేనేం నాకు భద్రత కల్పించి తీరాల్సిందే అన్నట్టుగా దర్జా ఒలకబోస్తోంది. ఈ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ లో వరుస రోడ్డు ప్రమాదాల్లో భారీగా టన్నులకు టన్నులు టమాటలు నేలపాలవడం.. వాటికి పోలీసులు భద్రత కల్పించడం కామన్ గా మారింది. తాజాగా అలాంటి ఘటనే కొమురంభీం జిల్లాలో మరొసారి చోటు చేసుకుంది. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడ గ్రామం వద్ద నాలుగు వరుసల రహదారిపై టమాటా లోడుతో వెళుతున్న ఐచర్ వ్యాన్ బోల్తా పడింది.