ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. 'వందల కిలోమీటర్లు నాతో నడిచిన సంగ్రామ సేనకు రుణపడి ఉంటాను. ఇంత పెద్ద అవకాశమిచ్చిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు. ఎన్నికల యుద్ధ రంగంలో ఉన్నాం. కార్యకర్తల త్యాగాలను వృధాగా పోనివ్వము. గోల్‌కొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. బీజేపీలో గ్రూపులున్నాయని, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది కేవలం దుష్ప్రచారమే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, పార్టీని అధికారంలోకి...