రాజ గోపాల్ రెడ్డి ఎక్కడ..? ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ కార్యక్రమాల్లో కనిపించని కమలం నేత..! వివరాలివే..

Komatireddy Raj Gopal Reddy: మిగిలినవారితో పోల్చుకుంటే ఆయనకు జాతీయ స్థాయి పదవి లభించింది. అయినా రాజగోపాల్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీపై అలిగి దూరంగా ఉంటున్నారా లేక మరేదైన రీజన్ ఉందా అనే ప్రశ్నలు అందరిని వెంటాడుతున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పొలిటికల్ లీడర్స్ అంతా యాక్టీవ్ అవుతున్నారు. తెలంగాణ బీజేపీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటున్నారు. కాషాయ పార్టీలో ఆయన సైలెన్స్‌పై చర్చ..

రాజ గోపాల్ రెడ్డి ఎక్కడ..? ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ కార్యక్రమాల్లో కనిపించని కమలం నేత..! వివరాలివే..
Komatireddy Raj Gopal Reddy
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Nov 03, 2023 | 2:24 PM

తెలంగాణ, ఆగస్టు 14: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పెద్దగా కనిపించడం లేదు. బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా అందరి నాయకులతో పాటు రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి లభించింది. మిగిలినవారితో పోల్చుకుంటే ఆయనకు జాతీయ స్థాయి పదవి లభించింది. అయినా రాజగోపాల్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీపై అలిగి దూరంగా ఉంటున్నారా లేక మరేదైన రీజన్ ఉందా అనే ప్రశ్నలు అందరిని వెంటాడుతున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పొలిటికల్ లీడర్స్ అంతా యాక్టీవ్ అవుతున్నారు. తెలంగాణ బీజేపీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటున్నారు. కాషాయ పార్టీలో ఆయన సైలెన్స్‌పై చర్చ సాగుతోంది. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

గత నెల 21న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో చివరిసారిగా రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కూడా రాలేదు. రాజగోపాల్ రెడ్డి ఫార్మ్ హౌస్ కు ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి కలిసి వచ్చారు. పార్టీపై అలిగిన రాజగోపాల్ రెడ్డిని కిషన్ రెడ్డి సముదాయించి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన వ్యూహమేంటీ ? అన్నదానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ మాత్రం సాగుతోంది. మునుగోడు ఉప ఉన్నికలో రాజగోపాల్ రెడ్డి అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చారు. పదివేల ఓట్లతో పరాజయం పాలైనా.. బీజేపీ అక్కడ ఓటు బ్యాంకును పెంచుకోగల్గింది.

ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో మునుగోడులో పాగా వేస్తామని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. అక్కడ బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి యాక్టీవ్ గా లేకపోవడంపై పార్టీ నేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తెరవెనక వేరే ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా ? బీజేపీలో ఆయన ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు ? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి స్కెచ్ ఎలా ఉంటుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..