Tirupati: అన్నమయ్య జన్మించిన తాళ్లపాకకు మహర్దశ కలిగేనా..? టీటీడీ దత్తత తీసుకున్నా ఫలితం లేదంటూ స్థానికుల ఆవేదన..
Annamayya District: పద కవితా పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం తాళ్లపాక.. కడప చెన్నై ప్రధాన రహదారిలో రాజంపేట మండలం బోయినపల్లి నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ తాళ్లపాక గ్రామం. ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోక నిరాదరణకు గురై, తన శోభను క్రమక్రమంగా కోల్పోతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాళ్లపాక అభివృద్ధికి టీటీడీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా, ఆగస్టు 17: పద కవితా పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం తాళ్లపాక.. కడప చెన్నై ప్రధాన రహదారిలో రాజంపేట మండలం బోయినపల్లి నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ తాళ్లపాక గ్రామం. ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోక నిరాదరణకు గురై, తన శోభను క్రమక్రమంగా కోల్పోతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాళ్లపాక అభివృద్ధికి టీటీడీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య చరిత్రను ఓ సారి గమనిస్తే.. తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు, అన్నమయ్యకు పద కవితా పితామహుడు అని బిరుదు కూడా ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు అన్నమయ్య. గొప్ప వైష్ణవ భక్తుడు.
అన్నమయ్య తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ రచించిన 32 వేలకు పైగా కీర్తనలు ఏంతో ప్రచుర్యం పొందాయి. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి. అందువల్లనే అయన పాటలు ఎంతో సులువుగా పాడటానికి ఇంపుగా ఉంటాయి. ఆయన తన పాటలతో చరిత్రలో ప్రతేక స్థానం పొందారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామంలో అయన 1408వ సంవత్సరం నారాయణాసురి, లక్కమాంబలకు జన్మించాడు. 1980 సంవత్సరంలో తాళ్లపాక గ్రామాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంవారు దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి అక్కడున్న అన్నమయ్య ధ్యాన మందిరంతో పాటు, సిద్దేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయాల ఆలనా పాలనా టీటీడీనే చూసుకుంటోంది.
తాళ్లపాక గ్రామానికి టీటీడీ హుండీలో పావలా వంతు
పద కవిత పితామహుని తన గానామృతంతో లోలలాడించిన అన్నమాచార్యుల వారికి, తాళ్లపాకకు తిరుమల ఉండి ఆదాయంలో పావలా వంతు భాగం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. కానీ అన్నమయ్య జన్మించిన జన్మస్థలం నిరాదరణకు గురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2008వ సంవత్సరంలో రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తాళ్లపాక అభివృద్ధికి కొంతమేర కృషి చేశారని చెప్పకోవచ్చు. అప్పట్లో టిటిడి చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అప్పట్లో బోయినపల్లిలోని ప్రధాన రహదారిలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు తాళ్లపాక గ్రామానికి అనేక వరాల వర్షం కురిపించారు నేతలు. తాళ్లపాక గ్రామానికి ప్రధాన రహదారి నుంచి నాలుగు లైన్ల రోడ్డుతో పాటు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, తాళ్లపాక చెరువును పుష్కరిణిగా మార్చడం, భక్తుల సౌకర్యార్థం వసతి భవనాలను నిర్మించడం వంటి ఎన్నో హామీలు ఇచ్చారు అయితే అవన్నీ క్రమేపి హామీలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం తిరిగి టిటిడి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితుల అవడంతో స్థానిక ప్రజల్లో కొత్త అసలు మొలకెత్తాయి. తిరిగి ఈ ప్రాంతం మీద కరుణాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నారు. తాళ్లపాకు కు టీటీడీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశతో ఉన్నారు.
అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో సిద్దేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడే అన్నమాచార్యుల వారికి చెన్నకేశ్వరస్వామి ప్రత్యక్షమై ఆయన నాలుకపై బీజాక్షరాలు రాశారనేది చరిత్రకారుల వాదన. అర్పటినుంచే అన్నమా చార్యుల వారు తన కీర్తలను మొదలు పెట్టారు. అక్కడి నుంచే తిరుమలకుల కాలిమార్గం ద్వారా అన్నమయ్య చేరుకుంటారు. ఇప్పటికీ అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారా చాలామంది తిరుమలకు వెళుతుంటారు. అన్నమయ్యకు చేన్నకేశ్వరస్వామి దర్శనమిచ్చిన ఆలయ ప్రాంగణంలోనే రాగి చెట్టు జమ్మిచెట్టు మరియు మర్రి చెట్లు కలిసి ఒకే వృక్షంగా ఉంటాయి. వీటి చుట్టూ ప్రదర్శనలు చేస్తే దోషాలు నివారణ అవుతాయని కొంత మంది భక్తుల విశ్వాసం. ఇలాంటి అరుదైన వృక్షం మరి ఎక్కడ ఉండదని తాళ్ళపాక ప్రజలు అంటున్నారు.
ఇంతటి ప్రాచుర్యం ఉన్న తల్లాపాక నిరాదరణకు గురి అయిందని స్థానికుల ఆరోపణ, అన్నమయ్య జన్మస్థలిని వదిలేసి ప్రధాన రహదారిపై అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఏంటని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా టిటిడి మరియు ప్రభుత్వం తాళ్లపాకకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్థానికుల కోరుతున్నారు. భూమన టిటిడి ఛైర్మన్ గా రావడంతో తాళ్ళపాకకు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టే అని స్దానికులు అంటున్నారు .