Tiger Terror: ఏజెన్సీలో పెద్దపులి కలకలం.. పశువులపై పులి దాడి.. భయాందోళనలో పెదశీతనపల్లి గ్రామస్థులు
చింతూరు ఏజెన్సీని కొన్నాళ్లుగా పెద్దపులి భయం వెంటాడుతోంది. తాజాగా.. చింతూరు మండలం పెదశీతనపల్లిలో పెద్దపులి అడుగు జాడలను కనుగొన్నారు స్థానికులు. 10 రోజుల వ్యవధిలో ఐదు పశువులపై దాడి చేసింది. తాజాగా.. ఓ ఆవుపైనా దాడి చేసి గాయపర్చింది. అప్రమత్తమైన గ్రామస్తులు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో పశువుల కళేబారాలు లభ్యమయ్యాయి.
అడవిలో ఉండాల్సిన వన్యమృగాలు జనార్యణ్యంలోకి వస్తున్నాయి. పులులు, చిరుత, ఎలుగుబంట్లు వంటి కౄర మృగాల నుంచి ఏనుగులు, జింకలు, కొండచిలువ ఇలా అరణ్యంలో నివసించే జీవులు ప్రజల మధ్యకు వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడోచోట పులి కనిపించింది అన్న వార్తలు వింటూనే ఉన్నాం.. ఇక తిరుపతిలో వన్యమృగాల టెన్షన్ గురించి చెప్పాలిసిన పనిలేదు.. ఇప్పుడు మన్యం ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లూరి జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది.
చింతూరు ఏజెన్సీని కొన్నాళ్లుగా పెద్దపులి భయం వెంటాడుతోంది. తాజాగా.. చింతూరు మండలం పెదశీతనపల్లిలో పెద్దపులి అడుగు జాడలను కనుగొన్నారు స్థానికులు. 10 రోజుల వ్యవధిలో ఐదు పశువులపై దాడి చేసింది. తాజాగా.. ఓ ఆవుపైనా దాడి చేసి గాయపర్చింది. అప్రమత్తమైన గ్రామస్తులు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో పశువుల కళేబారాలు లభ్యమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. దాంతో.. పెదశీతనపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. గతంలోనూ అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి ఎస్‌ఆర్‌పురంలో పశువులపై దాడి చేసి చంపేసింది. ఇప్పుడు మరోసారి పెద్దపులి సంచరిస్తుండడంతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..