Andhra Pradesh: సజ్జల అవినీతిని ప్రశ్నిస్తే.. జగన్ ఫోన్ చేశారు.. ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో అగ్గిరాజేశాయి. ఓ వైపు పార్టీ రెబల్స్.. మరోవైపు పార్టీ అధిష్టానం మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆ పార్టీ బహిష్కృత ఎమ్యెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి.

Andhra Pradesh: సజ్జల అవినీతిని ప్రశ్నిస్తే.. జగన్ ఫోన్ చేశారు.. ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Anam Ramanarayana Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 26, 2023 | 11:52 AM

ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో అగ్గిరాజేశాయి. ఓ వైపు పార్టీ రెబల్స్.. మరోవైపు పార్టీ అధిష్టానం మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆ పార్టీ బహిష్కృత ఎమ్యెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి. టీవీ9తో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ జర్నలిస్టు‌ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఓటింగ్‌లో సీక్రెట్‌ బ్యాలెట్‌ పెడితే.. ఎవరు ఎవరికి ఓటేశారో వైసీపీ నేతలకు ఎలా తెలుసంటూ ఆనం రాంనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో ఇంచార్జీని పెట్టినరోజే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నానని.. కావాలనే అగ్గిరాజేశారంటూ మండిపడ్డారు.

తాను క్రాస్‌ ఓటింగ్‌ చేశాననేది నామీద బురద జల్లడమే అంటూ.. ఈ సందర్భంగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల ముందురోజు ప్రకటనకి, తర్వాత రోజు మాట్లాడినదానికి సంబంధం ఉందా? అంటూ ప్రశ్నించారు. అసలు ఆనం రాంనారాయణరెడ్డి ఓటుని పరిగణలోకి తీసుకోడంలేదని సజ్జల ముందురోజు అన్నారంటూ గుర్తుచేశారు. మరుసటిరోజు నేను క్రాస్‌ ఓటింగ్ చేశానని సజ్జల చెప్పారు.. అసలు సీక్రెట్‌ బ్యాలెట్‌లో ఎవరికి ఓటేశానో మీకెలా తెలుసు? అంటూ ప్రశ్నించారు.

నా ఓటే పరిగణలో లేనప్పుడు నేను ఎవరికి ఓటేస్తే మీకెందుకు? నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇంచార్జీగా నియమించారు.. అవినీతిని ప్రశ్నిస్తే సీఎం జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి అలా మాట్లాడొద్దన్నారంటూ ఆనం పేర్కొన్నారు. నా నియోజకవర్గంలో ఇంచార్జీని నియమించిన రోజే తాను ఆ పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. సజ్జల విలేఖరి స్థాయి నుంచి కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారో తెలసని.. కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..