Gudivada Amarnath: కార్యకర్తలే నా బలం-బలగం.. అక్కడి నుంచే పోటీ చేస్తా.. మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. కానీ.. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకటంటే రెండంటాం.. రెండంటే.. మూడంటాం.. అంటూ విమర్శల మీద విమర్శలు చేసుకుంటున్నాయి. రోజుకో విషయం తెరపైకి వచ్చి రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఈ తరుణంలో సీట్ల విషయంలో కూడా పలు ఊహగానాలు మొదలవ్వడం.. నేతల మధ్య మరింత విమర్శలకు కారణమవుతోంది.

Follow us

|

Updated on: Aug 23, 2023 | 11:52 AM

అనకాపల్లి, ఆగస్టు 23: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. కానీ.. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకటంటే రెండంటాం.. రెండంటే.. మూడంటాం.. అంటూ విమర్శల మీద విమర్శలు చేసుకుంటున్నాయి. రోజుకో విషయం తెరపైకి వచ్చి రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఈ తరుణంలో సీట్ల విషయంలో కూడా పలు ఊహగానాలు మొదలవ్వడం.. నేతల మధ్య మరింత విమర్శలకు కారణమవుతోంది. ఈ క్రమంలో అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ నేత, మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. ఎక్కడనుంచి పోటీ చేస్తారన్న విషయంపై కీలక ప్రకటన చేశారు. సొంత ఇలాఖా అనకాపల్లిలో మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్.. పోటీ విషయంతోపాటు చేసిన పలు కీలక కామెంట్స్ రాజకీయ చర్చకు దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచే మళ్లీ పోటీ చేస్తానని గుడివాడ అమర్‌నాథ్.. కార్యకర్తలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనపై అవినీతి బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలపై మంత్రి గుడివాడ మండిపడ్డారు. కార్యకర్తలే నా బలం- బలగం అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. బలం మీరే.. బలహీనత మీరే.. జనసేన, టీడీపీ కలిసి తనపై బురదజల్లుతున్నాయంటూ గుడివాడ పేర్కొన్నారు.. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా.. గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

అయితే, గుడివాడ అమర్‌నాథ్ పోటీ విషయంతోపాటు.. జనసేన పలు ఆరోపణలు సైతం చేస్తోంది. ఈ క్రమంలో గుడివాడ జనసేన విమర్శలను తిప్పికొట్టడంతోపాటు.. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..