Tirupati News: తిరుమల నడకదారిలో బోనుకి చిక్కిన చిరుత.. విజువల్స్ చూస్తే షాకే..
Tirumala News in Telugu: లక్షితపై ఎక్కడైతే దాడి జరిగిందో.. రెండో చిరుత కూడా సరిగ్గా అక్కడికే వెళ్లింది. నామాలగవి అత్యంత సమీపంలో రాత్రి 2గంటల సమయంలో బోనులో చిక్కింది. ఉదయం స్పాట్‌కి వెళ్లిన అధికారులు చిక్కిన చిరుతను ప్రత్యేక బోనులో తిరుపతి జూకి తరలించారు. ప్రస్తుతం పులి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. కాగా, లక్షితపై చిరుత దాడితో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలతో చిరుతల సంచరాన్ని నిశితంగా గమనిస్తున్నారు. అవి ఏయే ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి..? 5 చిరుతలే పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయా? వేరే చిరుతలు కూడా నామాలగవి ప్రాంతానికి..
తిరుమల కొండపై ఆపరేషన్ చిరుతలో భాగంగా రెండో చిరుత బోనుకి చిక్కింది. నామాలగవిలో రాత్రి సంచరించిన చిరుత.. సరిగ్గా 1:37 గంటలకు బోను దగ్గరికి వెళ్లింది. ఎరగా వేసిన కుక్కను వేటాడేందుకు చిరుత బోనులోకి వెళ్లింది. అంతలోనే బోను క్లోజ్ అయింది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బోనులో బంధీ అయిన చిరుతను ఉదయం జూకి తరలించారు అధికారులు. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీస్తున్నారు.
తిరుమల కొండపై బోనుకి చిక్కిన చిరుతను తిరుపతి జూకి తరలించారు అధికారులు. ప్రస్తుతం చిరుత ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. మరికొద్దిసేపట్లో చిరుతకి సంబంధించిన వెంట్రుకలు, గోళ్ల శాంపిళ్లను ల్యాబ్‌కి పంపనున్నారు. లక్షితపై దాడి చేసింది ఇదే చిరుతా కాదా అన్నది ల్యాబ్ నివేదిక తేల్చనుంది. మరోవైపు నామాలగవి ప్రాంతంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయని భావిస్తున్న మూడు చిరుతల్ని కూడా త్వరలోనే పట్టుకుంటామంటున్నారు అధికారులు.
లక్షితపై ఎక్కడైతే దాడి జరిగిందో.. రెండో చిరుత కూడా సరిగ్గా అక్కడికే వెళ్లింది. నామాలగవి అత్యంత సమీపంలో రాత్రి 2గంటల సమయంలో బోనులో చిక్కింది. ఉదయం స్పాట్‌కి వెళ్లిన అధికారులు చిక్కిన చిరుతను ప్రత్యేక బోనులో తిరుపతి జూకి తరలించారు. ప్రస్తుతం పులి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. కాగా, లక్షితపై చిరుత దాడితో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలతో చిరుతల సంచరాన్ని నిశితంగా గమనిస్తున్నారు. అవి ఏయే ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి..? 5 చిరుతలే పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయా? వేరే చిరుతలు కూడా నామాలగవి ప్రాంతానికి వస్తున్నాయా? అన్నదానిపై ఆరాతీస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఐదు చిరుతల్ని బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కాగా, భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే చిరుతల్ని బంధిస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. భక్తులకు కర్రల పంపిణీపై వచ్చే విమర్శల్ని కొట్టిపడేశారు భూమన. నిపుణులు, అధికారుల సూచనల మేరకే కర్రలు ఇస్తున్నామన్నారు. బోనులో చిరుత చిక్కిన దృశ్యాలపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని.. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
శ్రీసత్యసాయి జిల్లాలో మరో చిరుత మృతి..
ఓవైపు చిరుతలు మనుషులపై దాడి చేసి చంపేస్తుంటే.. మరోవైపు వరుసగా చిరుతల మృతి కలకలం రేపుతోంది. తాజాగా రెండు రోజుల్లో రెండు చిరుతలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి గ్రామంలో ఇవాళ ఓ చిరుత డెడ్‌బాడీ కనిపించింది..అలాగే నిన్న కూడా ఒక చిరుత డెడ్‌బాడీ గుర్తించింది అటవీశాఖ..అయితే వరుసగా చిరుతల డెడ్‌బాడీలు బయటపడటంతో ఉలిక్కిపడుతున్నారు అక్కడి గ్రామస్తులు, అధికారులు.. చిరుత డెడ్‌బాడీలను పరిశీలించేందుకు, చిరుత మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ఇవాళ స్పాట్‌కి రానున్నారు అటవీశాఖ అధికారులు.
తిరుమల అడవుల్లో బోన్‌లో చిక్కిన చిరుత విజువల్స్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..