Andhra Pradesh: కాపర్లను బెదిరించి 30 గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు.. పోలీసుల ఎంట్రీతో 5 గంటల్లోనే..
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం పరిధిలోని బుళ్ళసముద్రం గ్రామ పొలాల్లో రాత్రి వేళలో గొర్రెల మందకు కాపలాగా ఉన్న గొర్రెల కాపర్లను బెదిరించి 30 గొర్రెలను బొలేరో వాహనంలో ఎత్తుకెళ్లారు దొంగలు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధిత గొర్రెల కాపర్లలో ఒకరు 100కు ఫోన్ చేశారు. తమను బెదిరించి దొంగలు గొర్రెలను ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన మడకశిర సిఐ సురేష్ బాబు తన సిబ్బందిని అప్రమత్తం చేశాడు. రెండు టీమ్ లుగా పోలీసులను పంపి, ఐదు గంటలలోపు గొర్రెల దొంగతనానికి పాల్పడిన దొంగల వాహనాన్ని..
అనంతపురం, ఆగస్టు 11: డయల్ 100 కి ఫోన్ చేస్తే ప్రాణాలు కాపాడలేని సందర్భాలు ఎన్నో చూసాం…. కానీ మా గొర్రెలు దొంగలు ఎత్తుకెళ్లారు అంటూ గొర్రెల కాపరులు డయల్ 100 కు ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే కేసును చేదించారు మడకశిర పోలీసులు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలంలో శుక్రవారం (ఆగస్టు 11) ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం పరిధిలోని బుళ్ళసముద్రం గ్రామ పొలాల్లో రాత్రి వేళలో గొర్రెల మందకు కాపలాగా ఉన్న గొర్రెల కాపర్లను బెదిరించి 30 గొర్రెలను బొలేరో వాహనంలో ఎత్తుకెళ్లారు దొంగలు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధిత గొర్రెల కాపర్లలో ఒకరు 100కు ఫోన్ చేశారు. తమను బెదిరించి దొంగలు గొర్రెలను ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన మడకశిర సిఐ సురేష్ బాబు తన సిబ్బందిని అప్రమత్తం చేశాడు. రెండు టీమ్ లుగా పోలీసులను పంపి, ఐదు గంటలలోపు గొర్రెల దొంగతనానికి పాల్పడిన దొంగల వాహనాన్ని అడ్డగించి.. పట్టుకొన్నారు. వారిని బంధించి.. వారి వద్ద నుంచి 3 లక్షల 80 వేలు విలువగల గల 30 గొర్రెలు, ఒక బొలెరో వాహనం, ఒక ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డయల్ 100 మనుషుల రక్షణ కోసమే కాదు.. ఆపదలో ఉన్న వారు ఎవరైనా డయల్ చేస్తే బాధితులకు పోలీసుల భరోసా ఉంటుందనడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ.
ఎత్తుకెళ్లిన గొర్రెలను తిరిగి అప్పగించిన పోలీసుల వీడియో..
పట్టుబడిన గొర్రెల దొంగలను మడకశిర మండలం కదిరేపల్లి క్రాస్ లో అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ బాబు తెలిపారు. దొంగిలించిన గొర్రెలను కాపరి ఈరన్నకు పోలీసులు అప్పగించారు. డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే స్పందించిన పోలీసులకు గొర్రెల కాపరులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.