Nalluri Naresh

Nalluri Naresh

Senior Correspondent - TV9 Telugu

naresh.nalluri@tv9.com
Donkey’s milk: బాబోయ్‌..! గాడిద పాలకు భలే గిరాకీ..  లీటర్‌ ధర పదివేలకు చేరువగా..!!

Donkey’s milk: బాబోయ్‌..! గాడిద పాలకు భలే గిరాకీ.. లీటర్‌ ధర పదివేలకు చేరువగా..!!

హిందూపురం చుట్టుపక్కల గ్రామాలకు పొద్దున్నే గాడిదలను తోలుకొచ్చి ఇంటి ముందే పాలు పితికి ఇస్తున్నారు... సాధారణంగా పిల్లలు పుట్టిన తరువాత వారికి గాడిద పాలు పోస్తుంటారు. ఇది చాలా కాలంగా వస్తోంది. గాడిద పాలు తాగిస్తే చురుగ్గా ఉంటారని.. మాటలు బాగా వస్తాయని నమ్ముతారు. కానీ కాల క్రమంలో ఇది మరుగన పడింది. కానీ ప్రస్తుతం కొందరు ఈ పాత విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి.. గాడిద పాలకు ఎక్కడా లేని డిమాండ్ సృష్టించారు...

Andhra Pradesh: ఆ దేవుడికి గులక రాళ్ళే నైవేద్యం.. అలా చేస్తేనే కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం..

Andhra Pradesh: ఆ దేవుడికి గులక రాళ్ళే నైవేద్యం.. అలా చేస్తేనే కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం..

ఆదిపరాశక్తి.. హిందువులు ప్రధానంగా పూజించే దేవుళ్లు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇక గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆయా ప్రాంతాల ప్రజలు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, అంకాలమ్మ, వివిధ రకాల పేర్లలో గ్రామీణ దేవతలను కొలుస్తారు భక్తులు. తమ శక్తి మేరకు ఉత్సవాలు నిర్వహించి, దేవతా మూర్తులకు నైవేద్యం, ప్రసాదాలు అర్పిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంప్రదాయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి.

ఘోర ఘటన: రైలు ఇంజన్ ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా ఇంజిన్ ఆన్ చేసిన మరో మెకానిక్.. ఆ తర్వాత

ఘోర ఘటన: రైలు ఇంజన్ ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా ఇంజిన్ ఆన్ చేసిన మరో మెకానిక్.. ఆ తర్వాత

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే లోకో షెడ్‌లో దారుణ ప్రమాదం. రైల్ ఇంజన్ రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు శాంతారాం అనే ఉద్యోగి దుర్మరణం. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే లోకో షెడ్ లో డీజిల్ ఇంజన్లకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు శాంతారామ్ అనే గ్రేడ్ వన్ మెకానిక్ దుర్మరణం పాలయ్యాడు. రైలు ఇంజన్ లోని ప్రెషర్ ఫ్యాన్ రబ్బర్ లు మారుస్తుండగా మరో ఉద్యోగి దీనిని గమనించకుండా రైలు ఇంజన్ ఆన్ చేయడంతో ఫ్యాన్ రెక్కల మధ్య చిక్కుకొని శాంతారాం దేహం..

Andhra Pradesh: అయ్యో పాపం పసికందు..! వేరు శెనగ విత్తనం గొంతులో ఇరుక్కుని రెండేళ్ళ చిన్నారి మృతి

Andhra Pradesh: అయ్యో పాపం పసికందు..! వేరు శెనగ విత్తనం గొంతులో ఇరుక్కుని రెండేళ్ళ చిన్నారి మృతి

Anantapur: పల్లీ విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక విలవిల్లాడింది చిన్నారి. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిన చిన్నారి పరిస్థితి అర్థం కాక కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు వైద్యులు. పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.

Andhra Pradesh: భర్త చనిపోయి ఐదేళ్లు.. పాప వయసు ఏడాది.. తనకే పుట్టిందంటూ పోలీసులతో వాదన.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..

Andhra Pradesh: భర్త చనిపోయి ఐదేళ్లు.. పాప వయసు ఏడాది.. తనకే పుట్టిందంటూ పోలీసులతో వాదన.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..

అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆమె భర్త చనిపోయి 5 ఏళ్లు అవుతుండగా.. పాప వయసు మాత్రం 18 నెలలే. ఈ గ్యాప్‌ ఆధారంగా గట్టిగా నిలదీస్తు అసలు మ్యాటర్ అంతా రివీల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బిందెల కాలనీలో నివాసం ఉంటున్న మారెక్క, పరశురాం దంపతులకు నలుగురు కుమార్తెలు. మారెక్క దంపతులు బిందెల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మారెక్కకు కొద్ది రోజుల క్రితం అదే ఏరియాలో..

Andhra Pradesh: కాపర్లను బెదిరించి 30 గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు.. పోలీసుల ఎంట్రీతో 5 గంటల్లోనే..

Andhra Pradesh: కాపర్లను బెదిరించి 30 గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు.. పోలీసుల ఎంట్రీతో 5 గంటల్లోనే..

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం పరిధిలోని బుళ్ళసముద్రం గ్రామ పొలాల్లో రాత్రి వేళలో గొర్రెల మందకు కాపలాగా ఉన్న గొర్రెల కాపర్లను బెదిరించి 30 గొర్రెలను బొలేరో వాహనంలో ఎత్తుకెళ్లారు దొంగలు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధిత గొర్రెల కాపర్లలో ఒకరు 100కు ఫోన్ చేశారు. తమను బెదిరించి దొంగలు గొర్రెలను  ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన మడకశిర సిఐ సురేష్ బాబు తన సిబ్బందిని అప్రమత్తం చేశాడు. రెండు టీమ్ లుగా పోలీసులను పంపి, ఐదు గంటలలోపు గొర్రెల దొంగతనానికి పాల్పడిన దొంగల వాహనాన్ని..

Andhra Pradesh: అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు.. పందులు దొంగతనం చేసిన ముసుగు వీరులు..

Andhra Pradesh: అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు.. పందులు దొంగతనం చేసిన ముసుగు వీరులు..

తాళం వేసిన ఇళ్ళు టార్గెట్‌గా చేసుకుని ఇళ్ళు గుల్ల చేసే దొంగలను చూసాం.. బైకును బయటపెడితే ఎత్తుకెళ్లే దొంగలను చూసాం... అవకాశం వస్తే దేన్ని వదలకుండా బంగారం, డబ్బు, వస్తువులు అందిన కాడికి దోచుకెళ్లే దొంగలనూ ఇప్పటివరకు మనం చూశాం.. అయితే అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో ముసుగు ధరించిన దొంగలు వింత చోరికి పాల్పడ్డారు. ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి ముసుగు ధరించి వచ్చి పందులను ఎత్తుకెళ్లారు. ముగ్గురు దొంగలు చెడ్డి గ్యాంగ్ తరహాలో చెడ్డీలు ధరించి అర్ధరాత్రి గ్రామంలో ప్రవేశించి..

Andhra Pradesh: ప్రాణం పోతున్నా.. భార్యను హత్తుకుని ధైర్యం చెప్పిన కానిస్టేబుల్.. గుండెను పిండేసే దృశ్యాలు..

Andhra Pradesh: ప్రాణం పోతున్నా.. భార్యను హత్తుకుని ధైర్యం చెప్పిన కానిస్టేబుల్.. గుండెను పిండేసే దృశ్యాలు..

గాయాలతో ఉన్నా.. పాక్కుంటూ వెళ్లి భార్య అనితను హత్తుకుని.. ఏమీ అవదు, ధైర్యంగా ఉండమని ఆమెను సముదాయించాడు. గుండెలను పిండేసే ఈ ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. గాయపడ్డ కిరణ్ కుమార్, అనిత దంపతులను స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య అపిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు. అయితే, మార్గం మధ్యలోనే కిరణ్‌కుమార్‌ ప్రాణాలు విడిచారు. ఆయన భార్య అనిత సైతం ఆసుపత్రిలో ప్రాణాలతో..

Viral: వర్షాలు కురవాలని ఊరు ఊరంతా కలిసి ఏం చేశారో తెలుసా..? గాడిదలను అందంగా ముస్తాబు చేసి..

Viral: వర్షాలు కురవాలని ఊరు ఊరంతా కలిసి ఏం చేశారో తెలుసా..? గాడిదలను అందంగా ముస్తాబు చేసి..

వేసవి కాలం ముగిసింది.. వర్షాకాలం వచ్చేసింది. అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.. కానీ, ఆ మబ్బుల చాటున దాగున్న వరుణుడు మాత్రం అన్నదాత వైపు..కరువు సీమ వైపు చూడకుండా ముఖం చాటేశాడు. దీంతో వర్షాకాలంలో కూడా వర్షాలు కురవడం లేదు.. ఇప్పుడిదే అన్నదాతకు పెద్ద సమస్యగా మారింది. కరువుసీమలో వర్షాధారిత ప్రాంతాలే ఎక్కువ.

Andhra Pradesh: మరణించి చిరంజీవి.. అవయవదానంతో మరికొందరికి జీవితాన్ని ఇచ్చిన యువకుడు

Andhra Pradesh: మరణించి చిరంజీవి.. అవయవదానంతో మరికొందరికి జీవితాన్ని ఇచ్చిన యువకుడు

బ్రెయిన్ డెడ్ అయిన జగదీష్ అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో హుటాహుటిన ఆసుపత్రి వర్గాలు అవయవాలు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. జగదీష్ కి చెందిన కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ లో కర్నూల్ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి హైదరాబాద్ వైజాగ్ కు స్పెషల్ ఫ్లైట్ లో అవయవాలు తరలించారు.

Andhra Pradesh: డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లి గర్భంలోనే శిశువు మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల నిరసన

Andhra Pradesh: డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లి గర్భంలోనే శిశువు మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల నిరసన

నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వాకం ఓ పసికందు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మహిళకు సిజేరియన్‌ చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో పురిటి బిడ్డ గర్భంలోనే కన్నుమూసింది. డాక్టర్ నిర్లక్ష్యంతో సిజేరియన్ చేస్తుండగా శిశువుకు కత్తిగాట్లు అయ్యి తల్లి కడుపులోనే శిశువు మృతి చెందింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Anantapur: ప్రకృతి పులకరించింది… పరవశించి సయ్యాట ఆడిన జంట పాములు..

Anantapur: ప్రకృతి పులకరించింది… పరవశించి సయ్యాట ఆడిన జంట పాములు..

పామును చూస్తే మనుషులు వాటికి దూరంగా వెళ్ళటం...పాములు మనుషులని చూసినా... చిన్న అలికిడి అయినా వేగంగా వెళ్ళిపోవటం మనం చూస్తూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే పాముని చూస్తే మనిషికి భయం.. మనుషులను చూస్తే.. పాములు తప్పుకుని వెళ్తాయి. కానీ సర్పాలు సయ్యాట సమయంలో మాత్రం చుట్టూ ఉన్న ప్రపంచం మరిచిపోయి సయ్యాట ఆడటం తరచూ అక్కకడక్కడా చూస్తూనే ఉంటాం..