CM YS Jagan: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ.. వివిధ అంశాలపై గంట 15 నిమిషాల పాటు చర్చ
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తోముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు గంట 15 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. అనంతరం సీఎం జగన్ రాజ్‌భవన్ నుంచి తాడేపల్లి బయల్దేరి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. గవర్నర్‌ను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు సీఎం జగన్. దాదాపు గంట 15 నిమిషాల పాటు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. విశాఖలో మంగళవారం జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్‌కు తెలియజేశారు సీఎం జగన్. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజెంట్ రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.
మంగళవారం విశాఖలో జరిగే జీ-20 సమావేశానికి వెళుతున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు సైతం ఈ సదస్సుకు హాజరవుతున్నారు. విశాఖలో జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు అతిథుల కోసం ఇప్పటికే ఘనంగా విందు ఏర్పాటు చేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం