AP Panchayat By-Elections: ముగిసిన మినీ యుద్ధం.. పంచాయతీ ఉప ఎన్నికల్లో ‘ఫ్యాన్‌’ హవా..

AP Panchayat By-Elections Results: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ తన వైభవాన్ని కొనసాగించింది. సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు మెంబర్ స్థానాల్లోనూ ఫ్యాన్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవాయే నడిచింది. మరోవైపు గతంలో వైసీపీ గెలిచిన కొన్ని స్థానాలను తాము కైవసం చేసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది.

AP Panchayat By-Elections: ముగిసిన మినీ యుద్ధం.. పంచాయతీ ఉప ఎన్నికల్లో ‘ఫ్యాన్‌’ హవా..
AP Politics
Follow us

|

Updated on: Aug 20, 2023 | 7:26 AM

AP Panchayat By-Elections Results: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ తన వైభవాన్ని కొనసాగించింది. సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు మెంబర్ స్థానాల్లోనూ ఫ్యాన్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవాయే నడిచింది. మరోవైపు గతంలో వైసీపీ గెలిచిన కొన్ని స్థానాలను తాము కైవసం చేసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. శనివారం జరిగిన ఏపీ పంచాయతీ ఉప ఎన్నికలు మినీ యుద్ధాన్ని తలపించాయి. బై ఎలక్షన్స్‌ పలు ప్రాంతాల్లో రాజకీయ సెగలు పుట్టించాయి. వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు కొనసాగాయి. కౌటింగ్‌ సమయంలోనూ కొన్ని ప్రాంతాల్లో వివాదాలు చెలరేగాయి.

34 సర్పంచ్‌, 245 వార్డులకు ఉప ఎన్నిక

ఏపీలోని పలు జిల్లాల్లో పంచాయితీ ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 34 సర్పంచ్‌, 245 వార్డు మెంబర్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఇక.. మధ్యాహ్నం వరకు పోలింగ్‌ కొనసాగగా.. ఆ తర్వాత కౌంటింగ్‌ జరిగింది. దాంతో.. ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడయ్యాయి. మెజార్టీ స్థానాల్లో అధికారపార్టీ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగించారు.

64 స్థానాలకు.. 30సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం

2021 లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మరణించడం లేక వివిధ కారణాలతో ఖాళీ అయినవి మొత్తం 64 సర్పంచ్‌ స్థానాలు, 1063 గ్రామ పంచాయితీలు..వీటిలో..64 సర్పంచ్ స్థానాలతో పాటు 1033 వార్డు సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు జరిగాయి. ఇందులో 30 స్థానాలు ఏకగ్రీవం కాగా..34 సర్పంచ్‌ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి.. ఇందులో 23 స్థానాలను వైసీపీ, పది స్థానాలను టీడీపీ దక్కించుకోగా… ఒక్క చోట జనసేన గెలిచింది. మరోవైపు 2021 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న స్థానాల్లో కొన్నింటిని ఈసారి టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. టీడీపీ సపోర్టుతో గెలిచిన అభ్యర్థులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో..

చెదురుమదురు ఘటనలతో

మరోవైపు ఉప ఎన్నికల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. అయితే ఎక్కడా రీపోలింగ్ నిర్వహించే అవకాశం లేకుండా ఎన్నికలు ముగిశాయి..నంద్యాల,ఎన్ఠీఆర్ జిల్లాలతో పాటు పలు చోట్ల కౌంటింగ్ విషయంలో గందరగోళం ఏర్పడింది.. ఒక్క ఓటు తేడాతో.. రెండు చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం తో ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. అయితే ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం,అభివృద్ధి తోనే నమ్మకంతో తమకు తిరిగి ఎక్కువ స్థానాలు కట్టబెట్టినట్లు వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు లొంగకుండా టీడీపీ అభ్యర్థులను గెలిపించారంటూ టీడీపీ చెబుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..