Andhra Pradesh: హోమ్ వర్క్ చేయలేదని మూడో తరగతి బాలికను చితక్కొట్టిన ఉపాధ్యాయుడు
హోమ్ వర్క్ చేయ లేదని మూడవ తరగతి విద్యార్థిని ని స్కూల్ హెడ్ మాస్టర్ విచక్షణా రహితంగా చితక కొట్టిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ ఆయిషా మాస్టారు ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహం చెందిన హెడ్ మాస్టారు శామ్యూల్ విచక్షణారహితంగా చిన్నారి అని కూడా చూడకుండా తన చేతిలో ఉన్న..
ఏలూరు, ఆగస్టు 18: చిన్న విషయానికే ఉపాధ్యాయులు విద్యార్ధుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. హోం వర్క్ చేయనందుకు, తరగతి గదిలో నిద్రపోయినందుకు, ఫీజులు చెల్లించనందుకు.. ఇలా కారణం ఏదైతేనేమి విద్యార్ధులను దారుణంగా హింసిస్తున్నారు. తాజాగా మూడో తరగతి చదువుతోన్న బాలిక హోం వర్క్ చేయలేదని ఒంటిపై వాతలు పొంగేటట్లు చితకబాదాడో ఉపాధ్యాయుడు. ఇందేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హోమ్ వర్క్ చేయ లేదని మూడవ తరగతి విద్యార్థిని ని స్కూల్ హెడ్ మాస్టర్ విచక్షణా రహితంగా చితక కొట్టిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ ఆయిషా మాస్టారు ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహం చెందిన హెడ్ మాస్టారు శామ్యూల్ విచక్షణారహితంగా చిన్నారి అని కూడా చూడకుండా తన చేతిలో ఉన్న కర్ర తో చితక కొట్టాడు. దీంతో చిన్నారి వీపు, చేతులు మీద వాతలు తేలడం తో అది చూసిన చిన్నారి తల్లితండ్రులు హెడ్ మాస్టారు శామ్యూల్ ను నిలదీశారు.
శరీరంపై గాయాలతో ఉన్న బాలిక వీడియో..
దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన స్కూల్ సిబ్బంది ఇక్కడ మీ అమ్మాయి చదవడానికి వీలు లేదని టిసి తీసుకుని వెళ్ళిపొమ్మంటూ దురుసుగా సమాధానం చెప్పారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోమ్ వర్క్ చేయనందుకు ఇలా దారుణంగా కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిని ని అమానుషంగా కొట్టిన హెడ్ మాస్టర్ పై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.