Andhra Pradesh: డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లి గర్భంలోనే శిశువు మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల నిరసన
నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం ఓ పసికందు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మహిళకు సిజేరియన్ చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో పురిటి బిడ్డ గర్భంలోనే కన్నుమూసింది. డాక్టర్ నిర్లక్ష్యంతో సిజేరియన్ చేస్తుండగా శిశువుకు కత్తిగాట్లు అయ్యి తల్లి కడుపులోనే శిశువు మృతి చెందింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
అనంతపురం, ఆగస్టు 1: నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం ఓ పసికందు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మహిళకు సిజేరియన్ చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో పురిటి బిడ్డ గర్భంలోనే కన్నుమూసింది. డాక్టర్ నిర్లక్ష్యంతో సిజేరియన్ చేస్తుండగా శిశువుకు కత్తిగాట్లు అయ్యి తల్లి కడుపులోనే శిశువు మృతి చెందింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
అనంతపురం పట్టణానికి చెందిన రేష్మభాణుకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటీన నగరంలోని స్నేహలత హాస్పిటల్ ఆస్పత్రికి తరలించారు. నిండు గర్భిణీ అయిన రేష్మభాను జాయిన్ చేసుకుని చికిత్స నందించారు. సహజ ప్రసవం కాదని ఆమెకు సిజేరిన్ చేయాలని వైద్యులు తెలిపారు. చేసేదిలేక కుటుంబ సభ్యులు సరేనన్నారు. సిజేరియన్ చేస్తుండగా కడుపులో ఉన్న బిడ్డకు కత్తి కోసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శిశివు గర్భంలోనే చనిపోయింది. ఆ తర్వాత మృతి చెందిన బిడ్డను బయటకు తీసి కుట్లువేశారు. ఏమీ ఎరగనట్లు బిడ్డ కడుపులోనే మృతి చెందినట్లు బంధువులకు తెలిపారు.
ఐతే బిడ్డ శరీరంపై కత్తిగాట్లు ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ అరుణను నిలదీశారు. ఆమె బుకాయించడంతో బాధితురాలి బంధువులు స్నేహలత హాస్పిటల్ ఎదుర నిరసనకు దిగారు. వైద్యుల నిర్వాకం వల్లనే పండండి బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ అరుణ నిర్లక్ష్యంగా వ్యవహరిండం వల్లే బిడ్డ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. సిజేరియన్ లో కత్తి కోసుకుని మృతి చెందిన ఆడ శిశువుతో హాస్పిటల్ ముందు బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.