Andhra Pradesh: విద్యార్ధులకు అలర్ట్.. ఏపీ స్కూళ్లకు సంక్రాంతి సెలవులు మారాయ్.. వివరాలు ఇవిగో..
ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ముఖ్య అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు ఇచ్చే సంక్రాంతి సెలవుల్లో మార్పులు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ముఖ్య అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు ఇచ్చే సంక్రాంతి సెలవుల్లో మార్పులు జరిగాయి. మొదటిగా జగన్ సర్కార్ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండగా.. 17న స్కూల్స్ తిరిగి పున: ప్రారంభం కావాల్సి ఉంది. 14న భోగి, 15న సంక్రాంతి, 16వ తేదీన కనుమ, 17న ముక్కనుమ ఉన్నందున.. ఆ రోజు కూడా సెలవు ఇవ్వాలని కోరుతూ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్రోపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. దీంతో ఆయా సెలవుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వీటిని జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు మార్పు చేసి.. పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా జీవో విడుదల చేశారు. దీంతో 19వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.