Viral News: 28 ఏళ్ల వయసులో 200 సర్జరీలు.. తన గుండెను ప్యాక్ చేసి అల్మారాలో పెట్టుకుని జీవిస్తున్న యువతి

న్యూజిలాండ్‌కు చెందిన ఈ అమ్మాయి పేరు జెస్సికా మన్నింగ్.  ఒక వింత వ్యాధితో జన్మించింది జెస్సికా. తన గుండెను ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి అల్మారాలో ఉంచాలి. అవును, ఈ విషయం మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది పూర్తిగా నిజం.

Viral News: 28 ఏళ్ల వయసులో 200 సర్జరీలు.. తన గుండెను ప్యాక్ చేసి అల్మారాలో పెట్టుకుని జీవిస్తున్న యువతి
Jessica Manning
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2022 | 8:53 PM

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు.. ఆ మాట నిజం అనే విషయం గత కొంతకాలంగా మనవాళిపై దాడి చేస్తూ రకరాల ఇబ్బందులకు గురి చేస్తోన్న వైరస్ లను చూస్తే అనిపించకమానదు ఎవరికైనా.. ఏ రోగం ఎవరికి ఎప్పుడు వస్తుందో దేవుడే చెప్పగలడు. భూమ్మీద భగవంతుని స్వరూపంగా భావించే వైద్యులకు కూడా ఈ విషయం తెలియదు. అందుకే సమతుల్య ఆహారం తినాలని, రోజూ వ్యాయామం చేయాలని.. తద్వారా ఆరోగ్యం బాగుంటుందని చెబుతూ ఉంటారు. అయితే  కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచే వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆపై వారు తమ జీవితాంతం వైద్యం తీసుకుంటూ ప్రాణాల కోసం పోరాడవలసి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న అలాంటి ఓ అమ్మాయి గురించే ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. హృదయ విదారకమైన ఆ అమ్మాయి పరిస్థితి గురించి తెలుసుకుందాం..

న్యూజిలాండ్‌కు చెందిన ఈ అమ్మాయి పేరు జెస్సికా మన్నింగ్.  ఒక వింత వ్యాధితో జన్మించింది జెస్సికా. తన గుండెను ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి అల్మారాలో ఉంచాలి. అవును, ఈ విషయం మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది పూర్తిగా నిజం. ప్రస్తుతం యంత్రాల సాయంతో బాలిక జీవితం సాగుతోంది. యంత్రాలు ఆగిపోయిన రోజు ఆ అమ్మాయి ఊపిరి కూడా ఆగిపోతుంది.

గుండె సగం మాత్రమే అభివృద్ధి  మిర్రర్ పత్రిక నివేదిక ప్రకారం.. జెస్సికాకు పుట్టినప్పటి నుండి గుండె వ్యాధి ఉంది. నిజానికి.. ఆ యువతి గుండె సగం మాత్రమే అభివృద్ధి చెందింది. ఆమె గుండెలో రంధ్రాలు మరియు లీక్ వాల్వ్‌లు ఉన్నాయి. మూడేళ్ళ వయసులో ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పుడే చిన్నారి కొన్ని రోజులు జీవించడానికి భూమి మీదకు అతిథిగా వచ్చిందని అందరూ భావించారు. అయితే చిన్నారి కోసం వైద్యులు చేసిన కృషి.. తల్లిదండ్రుల ప్రయత్నాల కారణంగా ఆ చిన్నారి పెరిగి పెద్దై ఇప్పటికీ జీవించి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు 200 సర్జరీలు  జెస్సికా వయస్సు ఇప్పుడు 28 సంవత్సరాలు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికి ఆమెకు 200 కంటే ఎక్కువ పెద్ద , చిన్న శస్త్రచికిత్సలు జరిగాయి. ఐదుసార్లు ఓపెన్ హార్ట్ సర్జరీలు, రెండుసార్లు పేస్‌మేకర్ సర్జరీ, ఒకసారి ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు జరిగాయి. గుండె, కాలేయ మార్పిడి కూడా చేయించారు. ఇప్పుడు జెస్సికా యంత్రాల సాయంతో జీవిస్తోంది. తన హృదయాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి తన బెడ్‌రూమ్ అల్మారాలో ఉంచింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..