Fake Degree: ఉద్యోగాల కోసం అడ్డదారులు.. ఫేక్ సర్టిఫికెట్లతో సౌదీలో జైలుపాలవుతున్న భారతీయులు..
Fake Degree Certificate: కొందరు ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించుకుని.. విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తూ.. పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. ఇలా వందలాది మంది ఫేక్ సర్టిఫికెట్లతో భారత్ నుంచి గల్ఫ్ కంట్రీస్ తో పాటు చాలా దేశాలకు వెళ్లినట్లు సమాచారం.
Fake Degree Certificate: కొందరు ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించుకుని.. విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తూ.. పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. ఇలా వందలాది మంది ఫేక్ సర్టిఫికెట్లతో భారత్ నుంచి గల్ఫ్ కంట్రీస్ తో పాటు చాలా దేశాలకు వెళ్లినట్లు సమాచారం. తాజాగా.. ఉస్మానియా వర్సిటీ పేరుతో నకిలీ బీటెక్ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి.. సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్న ఓ తెలుగు వ్యక్తికి అక్కడి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. దీంతోపాటు.. 5వేల రియాల్ లు అంటే దాదాపు రూ.1.10 లక్షలకు పైగా జరిమానా కూడా విధించింది. ఫేక్ సర్టిఫికెట్ల కేసులో వరుసుగా చాలామంది అరెస్టు అవుతుండటంతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల దందా మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, నకిలీ సర్టిఫికెట్లతో దేశంలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నట్లు సౌదీ ప్రభుత్వానికి సమాచారం అందడంతో.. ఓ ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పరిశీలన జరుపుతోంది. ఇలా, అక్కడ పనిచేస్తున్న తెలుగువారు సహా.. ప్రవాసులు సమర్పించింది నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అని తేలితే.. వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలోనే దాదాపు ఐదారుగురు తెలుగు వారు నకిలీ సర్టిఫికెట్లతో పట్టుబడి జైలు పాలవ్వడం కలకలం రేపింది.
నకిలీ డిగ్రీ పట్టాలను కలిగి ఉన్న వ్యక్తులకు అక్కడి ప్రభుత్వం ఏడాదిన్నర వరకు జైలు శిక్ష, 5వేల రియాళ్ల జరిమానా విధిస్తుంది. అనంతరం శిక్ష పూర్తయిన తర్వాత.. వారిని సౌదీ అరేబియా నుంచి బహిష్కరిస్తుంది. అంతేకాకుండా నకిలీ సర్టిఫికెట్లతో పట్టుబడిన వారిని రాజ్యంలోకి ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధం కూడా విధించాలని సౌదీ అరెబీయా ప్రభుత్వం 2015లోనే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నకిలీ సర్టిఫికెట్లతో సౌదీ అరెబియాకు వచ్చి ఇంజినీర్లుగా స్థిరపడ్డవారు చాలా మంది ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. ఆ తర్వాత దీనిపై విచారణ కొనసాగిస్తున్న ప్రభుత్వం.. గత ఆరు నెలలుగా ఓ ప్రత్యేక ఏజెన్సీకి సర్టిఫికెట్ల పరిశీలనను అప్పగించి చర్యలు తీసుకుంటోంది.
సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజనీర్స్ (SCE) ఇప్పటికే వేలాది మంది వద్ద నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్లను కనుగొన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వారు దాదాపు 10 ఏళ్లకు పైనుంచి పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఫేక్ సర్టిఫికెట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. అయితే, తెలంగాణ నుంచి అత్యధికంగా ఫేక్ డిగ్రీలతో పట్టుబడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ జారీచేసినట్లుగా నకిలీ డిగ్రీలను సృష్టించి వాటితో సౌదీతో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారని.. వారే ఇప్పుడు జైళ్ల పాలవుతున్నారని పేర్కొంటున్నారు. ఒక్క తెలుగువారే కాదని.. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని సమాచారం.. అంతకుముందు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో జైలు పాలయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..