23rd TANA Conference: అమెరికాలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. తానా 23 కాన్ఫరెన్స్ సందర్భంగా..
NTR centenary celebrations: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే.
NTR centenary celebrations: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ సభల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్‌లో ప్రతిష్టాత్మక తానా 23వ మహాసభలు.. జులై 7, 8, 9వ తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ సభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, తానా సభల్లో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తానా ప్రతినిధులు వెల్లడించారు. జులై 8, శనివారం ఉదయం 10 గంటలకు పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తానా ప్రకటన విడుదల చేసింది.
తెలుగుదనానికి ప్రతిరూపు అన్న నందమూరి తారక రామునికి ఘనంగా నివాళిలర్పిస్తూ.. మరెన్నో కార్యక్రమాలు నిర్వహించనున్నామని.. దీనికి అందరికీ ఆహ్వానం పలుకుకున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా తారక రాముని ప్రాంగణం, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కకరణ, ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను వర్ణించే ఫోటో ఎగ్జిబిషన్ తో ఎన్టీఆర్ కు నివాళులర్పించనున్నట్లు తానా పేర్కొంది. ఈ సందర్భంగా నృత్యం, సంగీతం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తానా లోకంలో తారక రాముని శతజయంతి ఉత్సవాలు ఒక చారిత్రకమైన ఘట్టం.. దీనిలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ తానా ప్రతినిధులు కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..