Heligan Pineapple: ప్రపంచంలోనే ఈ ఫైనాపిల్ అత్యంత ఖరీదు.. ఒకొక్కటి లక్ష నుంచి పది లక్షలు.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..

ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌లో పండించే తోట పేరు మీద హెలిగాన్ పైనాపిల్ అని పిలుస్తారు. ఈ పైనాపిల్ ధర వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఒక్కో అనాస పండు ధర అక్షరాల లక్ష రూపాయలు. ఒకొక్కసారి వేలం వేస్తె.. పది లక్షలు కూడా పలుకుతుందట.

Heligan Pineapple: ప్రపంచంలోనే ఈ ఫైనాపిల్ అత్యంత ఖరీదు.. ఒకొక్కటి లక్ష నుంచి పది లక్షలు.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..
World Most Expensive Heligan Pineapple
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2022 | 9:30 AM

ప్రకృతి మానవులకు ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి అనాస పండు. దక్షిణ అమెరికాలోని ఫిలిప్పైన్స్‌లో పుట్టి ప్రపంచ వ్యాప్తం అన్ని దేశాలలో పెరుగుతున్న అనాస పండును అమెరికన్‌ ఆదివాసులు  దేవతా ఫలంగా భావిస్తారు. అనాస పండును పైనాపిల్ అని కూడా పిలుస్తారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే అనాస పండ్ల రూపంలోనే కాదు..  స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ పైనాపిల్‌లో రోగనిరోధక శక్తిని ఇచ్చే విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యానికి ఇది అద్భుతమైన పండు. తక్కువ ధరకే దొరకడంతో పాటు.. పోషకాలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులు కూడా అనాస పండుని అత్యంత ఇష్టంగా తింటారు.  అయితే ఇంగ్లాండ్ లో దొరికే హెలిగాన్ పైనాపిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదని మీకు తెలుసా..

ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌లో పండించే తోట పేరు మీద హెలిగాన్ పైనాపిల్ అని పిలుస్తారు. ఈ పైనాపిల్ ధర వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఒక్కో అనాస పండు ధర అక్షరాల లక్ష రూపాయలు. ఒకొక్కసారి వేలం వేస్తె.. పది లక్షలు కూడా పలుకుతుందట. దీంతో హెలిగాన్ పైనాపిల్ ప్రపంచంలో ఇదే అత్యంత కాస్టిలీగా ఖ్యాతిగాంచింది. ఎంత ధరైనా సరే ఈ అనాసను ఖరీదు చేయడానికి పోటీ పడతారు. ఈ అనాస పెంచడానికి చేసే పని గంటలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో దాని ధర దాదాపు 1,000 పౌండ్ల స్టెర్లింగ్ (మనదేశ కరెన్సీ లో రూ. 1 లక్ష) అని BBC నివేదిక పేర్కొంది. ఒక పంట చేతికి రావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుందని హెలిగాన్‌ గార్డెన్‌ నిర్వాహకులు వెల్లడించారు.

ఈ పనస 1819లో బ్రిటన్‌కు తీసుకువచ్చారు. అయితే దేశంలోని వాతావరణం పైనాపిల్ సాగుకు మంచిది కాదని హార్టికల్చరిస్టులు గ్రహించారు.  అనాస పండ్లను పెంచడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెక్కతో చేసిన పెద్దపెద్ద కుండీలు ఏర్పాటు చేసి, అందులో సేంద్రీయ ఎరువులు నింపి, తగినంత ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతో శ్రమతో ఈ పండ్లను పండిస్తున్నారు. పైనాపిల్ సంరక్షణ, ఎరువు, రవాణా ఖర్చులు, పైనాపిల్ కోసం తవ్వే గుంటలు, ఇతర చిన్న పనులతో పంట సస్యరక్షణ కోసం మనిషి అయ్యే ఖర్చులతో కలిసి అత్యంత కాస్టిలీ పంటగా మారింది. దీంతో హెలిగాన్  పైనాపిల్ ను లక్ష రూపాయలకు అమ్మాల్సి వస్తుందని నిర్వహకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ గ్రీన్‌హౌస్‌లో పండించిన రెండవ పైనాపిల్‌ను క్వీన్ ఎలిజబెత్ II కి బహుమతిగా ఇచ్చారట.  ప్రస్తుతం లక్ష రూపాయలకు అమ్ముతున్న ఈ పైనాపిల్ ను వేలం వేస్తే ఒక్కో పైనాపిల్ రూ.10 లక్షల వరకు పలుకుతుందని ఉద్యానవన అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..