Bread Recipe: గుడ్డు, ఒవెన్ లేకుండా ఇంట్లోనే రుచికరమైన స్వీట్ బన్స్ తయారు చేసుకోండి ఇలా

బేకరీలో దొరికే ఐటమ్స్ లో బన్స్ ఒకటి. వీటిని ప్రతి ఒక్కరూ  తినడానికి ఇష్టపడతారు.  బ్రెడ్ లో అనేక రకాలున్నాయి. చాలా భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. అయితే బన్ ను గుడ్లను, ఒవేన్ సహాయంతో తయారు చేస్తారు. కానీ గుడ్లు, ఒవేన్ లేకుండా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే స్వీట్ బన్ తయారీ గురించి ఈరోజు తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Dec 09, 2022 | 11:49 AM

1 / 6
 శీతాకాలంలో ఎక్కడికైనా వెళ్తుంటే.. తమ వెంట అరటిపండ్లు, కమలాఫలాలు, బ్రెడ్ వంటి రకరకాల ఆహారపదార్ధాలను తీసుకుని వెళ్లారు. అయితే ఈ బ్రెడ్‌కి వివిధ రుచులను జోడించి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 

2 / 6
 బన్ అనేది పిండి, బటర్, ఎగ్ ఈ మూడింటిని కలిపి తయారు చేసుకునే ఒక పసందైన అల్పాహారం. అయితే స్వీట్ బన్ ను రుచికరంగా గుడ్లు లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. రెసిపీ గురించి తెలుసుకుందాం.. 

3 / 6
 ఒక పెద్ద గిన్నె తీసుకుని 2 కప్పుల మైదా, 1 చెంచా ఈస్ట్, ఉప్పు,  మిల్క్ పౌడర్, ట్రూ ఫ్రూటీ, 250 గ్రాముల కండెన్స్‌డ్ మిల్క్ కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిగి పిండి ముద్దగా తయారు చేయండి. ఇప్పుడు ఆ పిండి ముద్దని మెత్తటి గుడ్డతో 2 గంటల పాటు కప్పి ఉంచండి.  

4 / 6
 
ఇలా రెండు గంటల పాటు ఉంచిన మైదా మిశ్రమాన్ని తీసుకుని దానిపై కొంచెం పిండి వేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు  వెచ్చని ప్రదేశంలో ఉంచండి. ఇప్పుడు మైదా మిశ్రమం పిండి బాగా ఉబ్బుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్‌లో పిండి తీసుకుని దానిని గుండ్రని ముద్దలుగా కట్ చేసుకోండి.

5 / 6
 ఇప్పుడు వాటిని తడి గుడ్డతో కప్పి 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఈలోగా కడాయిని గ్యాస్‌ స్టవ్ పెట్టి కొంచెం వేడి చేయండి.. తర్వాత కడాయిలో స్టాండ్ పెట్టి.. అందులో మైదా మిశ్రమ ముద్దలపై కొంచెం ఆయిల్ రాసి ఆ పైన నువ్వులు చల్లండి. అనంతరం ఫుడ్ స్టాండ్ లో వేసి మూత పెట్టండి. మూతలో లీక్ ఉంటే.. దానిని తడి పిండి ముద్దతో కవర్ చేయండి. అనంతరం ఈ కడాయిని తక్కువ వేడి మీద  30 నుండి 40 నిమిషాలు బేక్ చేయండి. తరువాత దీన్ని బైటకు తీసి కొంచెం చల్లారనివ్వండి.

6 / 6
Follow us